News May 19, 2024
‘NBK 109’ రిలీజ్ డేట్ ఫిక్స్?

నందమూరి బాలకృష్ణ హీరోగా ‘NBK 109’ అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతోన్న మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 10న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. ఇదే డేట్లో రిలీజ్ కానున్న ‘దేవర’ ఇంకా ముందే రిలీజ్ అవుతున్నట్లు టాక్. బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ఊర్వశీ రౌతేలా హీరోయిన్గా నటిస్తున్నారు. బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు.
Similar News
News January 9, 2026
గుంటూరులో MDMA మత్తు పదార్థాల పట్టివేత

గంజాయి, MDMA మత్తు పదార్థాలను కొత్తపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ వద్ద మున్నా, చిల్లర ప్రేమ కుమార్ విక్రయదారుల నుంచి లిక్విడ్ గంజాయి, MDMA 3.12 గ్రాములు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. గుంటూరు నగరంలో మత్తు పదార్థాల విక్రయం, సేవనం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ హెచ్చరించారు. నిందితులకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించిందన్నారు.
News January 9, 2026
ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల ప్రమాద బీమా: భట్టి

TG: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. ఇందుకోసం ప్రముఖ బ్యాంకర్లతో సంప్రదింపులు ముగిశాయన్నారు. ఇప్పటికే సింగరేణి, ట్రాన్స్కో, SPDCL, NPDCL, జెన్కో ఉద్యోగులకు రూ.కోటికి పైగా ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు చెప్పారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు.
News January 9, 2026
అయోధ్యలో నాన్-వెజ్ నిషేధం

అయోధ్య, పంచకోషీ యాత్ర రూట్లలో నాన్-వెజ్ అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్టు UP ప్రభుత్వం ప్రకటించింది. ఆధ్యాత్మిక ప్రాంతాల పవిత్రతను కాపాడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. హోటల్స్, రెస్టారెంట్లలో నాన్-వెజ్ పదార్థాల తయారీ, అమ్మకాలపై నిషేధం అమలులో ఉన్నప్పటికీ కొంతమంది టూరిస్టులు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని తింటున్నారని ఆరోపణలున్నాయి. దీంతో ఆన్లైన్ డెలివరీలపైనా నిషేధం విధించింది.


