News September 24, 2024
‘NBK 109’ రిలీజ్ డేట్ ఫిక్స్?

నందమూరి బాలకృష్ణ హీరోగా ‘NBK 109’ అనే వర్కింగ్ టైటిల్తో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానున్నట్లు సమాచారం. కొల్లి బాబీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్, ఊర్వశీ రౌతేలా, చాందినీ చౌదరి కీలక పాత్ర పోషిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Similar News
News January 7, 2026
తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ ఉదయం పెరిగిన బంగారం ధరలు కాసేపటి క్రితం తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.550 తగ్గి రూ.1,38,270కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.500 పతనమై రూ.1,26,750 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,77,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News January 7, 2026
అంబర్నాథ్ అలయన్స్.. హైకమాండ్స్ ఆగ్రహం

అంబర్నాథ్ (MH) మున్సిపాలిటీలో స్థానిక <<18786772>>BJP-కాంగ్రెస్<<>> కలిసిపోవడంపై ఇరు పార్టీల నాయకత్వాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆ ప్రాంత పార్టీ చీఫ్ సహా తమ కౌన్సిలర్లను కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. ఇక లోకల్ BJP నేతల తీరుపై CM దేవేంద్ర ఫడణవీస్ తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 సీట్ల కౌన్సిల్లో కాంగ్రెస్ 12, BJP-14, NCP (అజిత్)-4 శివసేన (షిండే)-27 పొందగా SSను పక్కనబెట్టి మిగతా పార్టీలు కూటమి ప్రకటించాయి.
News January 7, 2026
దావోస్లో ఫోర్త్ సిటీపై సీఎం ప్రజెంటేషన్

TG: దావోస్ పర్యటనలో CM రేవంత్ రెడ్డి ‘World Economic Forum’ సదస్సులో “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ డాక్యుమెంట్పై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రపంచ పెట్టుబడులకు కేంద్రంగా మారబోతున్నHYD ‘ఫోర్త్ సిటీ’ గురించి ప్రత్యేకంగా వివరించనున్నారు. తెలంగాణ రైజింగ్పై సమగ్ర నివేదికను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. జనవరి 19-23 వరకు ప్రపంచ ఆర్థిక వేదికలో TG పెవిలియన్లో ఫోర్త్ సిటీ నమూనాను ప్రదర్శించనున్నారు.


