News September 2, 2024
NBK 50 ఇయర్స్ వేడుకలు: వెంకీ, కమల్ ఏమన్నారంటే?

బాలకృష్ణ <<13997699>>50 ఏళ్ల సినీ ప్రయాణం<<>> ఎంతో మంది కొత్త నటులకు ఆదర్శం అని విక్టరీ వెంకటేశ్ అన్నారు. ఆయన ఎన్టీఆర్ కుటుంబం నుంచి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ‘సంస్కారం వల్ల అందరూ గుర్తుపెట్టుకునే వ్యక్తి బాలయ్య. ఆయనంటే స్వచ్ఛమైన మనసు, స్వేచ్ఛగా ఉండే తత్వం. ఆయన నిండు నూరేళ్లు బావుండాలని కోరుకుంటున్నాను’ అని కమల్ హాసన్ వీడియో బైట్ ద్వారా విషెస్ తెలిపారు.
Similar News
News December 2, 2025
ఈ సారి చలి ఎక్కువే: IMD

దేశంలో ఈ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో 4-5 రోజులు ఎక్కువగా కోల్డ్ వేవ్స్ ఉంటాయని చెప్పింది. కాగా దేశంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.


