News October 10, 2024

ఇక ఎన్సీకి కాంగ్రెస్ అవ‌స‌రం లేదా!

image

JKలో ప్ర‌భుత్వ ఏర్పాటుకు సిద్ధ‌మ‌వుతున్న NCకి ఇక కాంగ్రెస్ అవ‌స‌రం క‌నిపించ‌డం లేదు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 46 మంది MLAల బలం వీరికి ఉంది (NC 42+కాంగ్రెస్ 6). అయితే స్వ‌తంత్రులుగా గెలిచిన న‌లుగురు స‌భ్యులు తాజాగా NCకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. దీంతో NC, స్వతంత్రుల బలం 46కు చేరింది. త‌ద్వారా NCకి కాంగ్రెస్ అవసరం లేకుండాపోయింది. మరి NC ప్రభుత్వంలో కాంగ్రెస్‌ ఉంటుందా? లేదా? అన్నది వేచిచూడాలి.

Similar News

News November 17, 2025

సౌదీ బస్సు ప్రమాదం.. హెల్ప్‌లైన్ ఏర్పాటు

image

సౌదీలో జరిగిన ఘోర బస్సు <<18309348>>ప్రమాదంపై<<>> విదేశాంగ మంత్రి జైశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. రియాద్‌లోని ఎంబసీ, జెడ్డాలో కాన్సులేట్‌లు బాధిత కుటుంబాలకు అండగా ఉంటాయన్నారు. మరోవైపు కేంద్రం హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఏదైనా సమాచారం కోసం 8002440003, 0122614093, 0126614276, +966556122301 నంబర్లను సంప్రదించాలని సూచించింది.

News November 17, 2025

పెళ్లిపై రూమర్స్.. అసహ్యమేస్తోందన్న త్రిష

image

తనకు పెళ్లంటూ వస్తున్న రూమర్స్ అసహ్యం కలిగిస్తున్నాయని హీరోయిన్ త్రిష ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మ్యారేజ్, పొలిటికల్ ఎంట్రీపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ‘నేనెవరితో ఫొటో దిగితే వారితో పెళ్లి అయినట్లేనా? నాకు ఎంత మందితో వివాహం చేస్తారు? ఇలాంటి ప్రచారం ఆపండి’ అని పేర్కొన్నారు. త్రిష ఓ హీరోతో డేట్‌లో ఉందని, చండీగఢ్ బిజినెస్‌మ్యాన్‌ను పెళ్లి చేసుకోబోతున్నారని తరచుగా రూమర్లు పుట్టుకొస్తున్నాయి.

News November 17, 2025

కిచెన్ టిప్స్

image

* కొత్తిమీర వాడిపోతే వేర్లు కట్ చేసి ఉప్పు కలిపిన నీటిలో కాడలు మునిగేలా ఉంచాలి. అరగంట తర్వాత కొత్తిమీర తాజాగా మారుతుంది.
* ఎంత నీరు తాగినా దాహం తీరకపోతే ఒక యాలక్కాయ నోట్లో వేసుకొని నమలి నీళ్లు తాగాలి. * గసగసాలు రుబ్బేముందు 10 నిమిషాలు వేడినీటిలో నానబెట్టి మిక్సీ పడితే మెత్తగా అవుతాయి. * ఉప్పు చెమ్మ చేరి నీరు కారిపోకుండా ఉండాలంటే.. ఉప్పు ఉన్న జాడీలో రెండు పచ్చిమిరపకాయలు వేయాలి.