News September 15, 2024
‘NCC శిక్షణను కెడెట్లు సద్వినియోగం చేసుకోవాలి’

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్ లో NCC సీఏటీసీ-7 శిక్షణ శిబిరం ఆదివారం ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాకు చెందిన 600 మంది కెడెట్లు ఈ శిక్షణ శిబిరానికి హాజరయ్యారు. జిల్లా NCC కమాండింగ్ అధికారి కల్నల్ వికాస్ శర్మ మాట్లాడుతూ.. ఈనెల 23వ తేదీ వరకు ఈ శిబిరం కొనసాగుతుందని తెలిపారు. క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సైనికులకు ఇచ్చే తరహాలో శిక్షణ తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Similar News
News December 17, 2025
ఆదిలాబాద్ జిల్లాలో 54.45 శాతం నమోదు

ఆదిలాబాద్ జిల్లాలో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 54.45 శాతం సరాసరి ఓటింగ్ నమోదైందని జిల్లా పంచాయతీ అధికారి రమేశ్ తెలిపారు. బజార్హత్నూర్‌లో 53.57%, బోథ్ 47.73%, గుడిహత్నూర్ 58.11%, నేరడిగొండ 50.94%, సోనాల 55.56%, తలమడుగులో 61.19% నమోదైంది. ఓటర్లు చురుగ్గా పాల్గొంటున్నారు.
News December 17, 2025
గుడిహత్నూర్: స్కూటీపై వచ్చి ఓటేసిన 85 ఏళ్ల బామ్మ

గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఓ 85 ఏళ్ల బామ్మ ప్రజాస్వామ్యంపై తనకున్న మక్కువను చాటుకున్నారు. వయసు భారంతో ఉన్న శారీరక ఇబ్బందులను లెక్కచేయకుండా, ఆమె స్వయంగా స్కూటీపై పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆమె స్ఫూర్తిని చూసి స్థానికులు, ఎన్నికల సిబ్బంది అభినందనలు తెలిపారు. ఓటు హక్కు ప్రాముఖ్యంపై ఆమె అందరికీ ఆదర్శంగా నిలిచారని అధికారులు పేర్కొన్నారు.
News December 17, 2025
ఆదిలాబాద్: పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్: ఎస్పీ

పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు అనవసరంగా గుమిగూడరాదని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. కేంద్రాల వద్ద 163 బిఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందన్నారు. 100 మీటర్లు, 200 మీటర్ల దూరంలో ప్రత్యేక నియమ నిబంధనలు ఉంటాయని, వాటిని తప్పక పాటించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, వాటర్ బాటిళ్లు, ఆయుధాలు, పెన్నులు వంటి వాటికి అనుమతి లేదన్నారు. క్యూ లైన్ పద్ధతి పాటించాలని ఎస్పీ పేర్కొన్నారు.


