News September 15, 2024

‘NCC శిక్షణను కెడెట్లు సద్వినియోగం చేసుకోవాలి’

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్ లో NCC సీఏటీసీ-7 శిక్షణ శిబిరం ఆదివారం ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాకు చెందిన 600 మంది కెడెట్లు ఈ శిక్షణ శిబిరానికి హాజరయ్యారు. జిల్లా NCC కమాండింగ్ అధికారి కల్నల్ వికాస్ శర్మ మాట్లాడుతూ.. ఈనెల 23వ తేదీ వరకు ఈ శిబిరం కొనసాగుతుందని తెలిపారు. క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సైనికులకు ఇచ్చే తరహాలో శిక్షణ తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

Similar News

News July 5, 2025

సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి: ADB ఎస్పీ

image

ప్రతిరోజు వ్యాయామం చేస్తూ శారీరక దృఢత్వాన్ని కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ సిబ్బందికి సూచించారు. శనివారం ఆదిలాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించిన పరేడ్‌లో పాల్గొని సూచనలు చేశారు. సిబ్బంది ప్రతిరోజు వ్యాయామం చేయాలని, ప్రతి వారం నిర్వహించే పరేడ్‌లో పాల్గొని నిర్వహించే కవాతులో పరిపూర్ణత చెందాలన్నారు.

News July 5, 2025

ఆదిలాబాద్ ఆర్డీవో వినోద్ కుమార్ బదిలీ

image

ఆదిలాబాద్ ఆర్డీవో వినోద్ కుమార్ ఆకస్మిక బదిలీ అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బాధ్యతలు చేపట్టిన ఆయన ఎన్నికల నిర్వహణతో పాటు రెవెన్యూ సదస్సుల విజయవంతంలోనూ కీలకపాత్ర పోషించారు. అయితే తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోని (PRRD) విభాగానికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

News July 5, 2025

ADB: బాలలను పనిలో పెట్టుకున్న ముగ్గురిపై కేసు నమోదు

image

బాలలను పనిలో పెట్టుకున్న ముగ్గురిపై శుక్రవారం పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆదిలాబాద్ మదీనా హోటల్‌లో బాల కార్మికుడితో పని చేయించుకుంటున్న యజమాని అబ్దుల్ హసీబ్‌పై కేసు నమోదు చేసినట్లు 2 టౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. అదేవిధంగా మాంసం దుకాణ యజమాని ప్రవీణ్, మదీనా బెడ్ వర్క్ యజమాని షేక్ ఫరీద్‌పై కార్మిక శాఖ అధికారి శంకర్ గుప్తా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు 1 టౌన్ సీఐ సునీల్ చెప్పారు.