News September 30, 2025

NCD ఏర్పాటుకు చర్యలు: చిత్తూరు కలెక్టక్

image

పీహెచ్సీల్లో ఎన్సీడీ (నాన్ కమ్యూనికబుల్ డిసీజన్) సెల్ ఏర్పాటు చేస్తామని, దీనికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ టీం సహకరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు. కలెక్టరేట్‌లో ఎన్సీడీపై జిల్లాలో విస్తృతంగా పర్యటించిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఢిల్లీ) బృందం కలెక్టర్‌తో సమావేశమైంది. ప్రజా ఆరోగ్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

Similar News

News September 30, 2025

సెలవుపై వెళ్లిన చిత్తూరు DRO

image

జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మోహన్ కుమార్ వ్యక్తిగత పనుల నిమిత్తం సెలవు పెట్టారు. అక్టోబర్ 2 వరకు ఆయన సెలవుపై ఉండటంతో ఇన్‌ఛార్జ్ బాధ్యతలను డిప్యూటీ కలెక్టర్ కేడర్ అధికారికి అప్పగించారు. కలెక్టరేట్‌లో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ కలెక్టర్ కుసుమకుమారికి ఇన్‌ఛార్జ్ డీఆర్వోగా బాధ్యతలప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

News September 29, 2025

MP మిథున్ రెడ్డి బెయిల్‌పై నేడు తీర్పు

image

లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన MP పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విజయవాడ ACB కోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. దీంతో MPకి బెయిల్ వస్తుందా లేదా అన్న ఉత్కంఠ వైసీపీ శ్రేణుల్లో నెలకొంది.

News September 29, 2025

ఘోరం.. ఇసుకలో బిడ్డ లభ్యం

image

వరదయ్యపాలెంలో దారుణం చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున బస్టాండ్ సమీపంలోని ఓ దుకాణం వద్ద ఇసుకలో పూడ్చిన శిశువును పారిశుద్ధ్య కార్మికులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ఆదివారం రాత్రి ఓ గుర్తు తెలియని యువతి ఆడ శిశువుకు జన్మనిచ్చి అక్కడే ఉన్న ఇసుకలో పూడ్చినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ శిశువుకు ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.