News February 4, 2026

NCERTలో 117 ఉద్యోగాలు

image

NCERT 117 అకడమిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PG, M.LSc, NET/SET/SLET, PhD/M.Phil అర్హతతో పాటు అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1000. ప్రొఫెసర్‌కు నెలకు రూ.1,44,200, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,31,400, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ లైబ్రేరియన్‌కు రూ.57,700 చెల్లిస్తారు. అర్హులు FEB 20 వరకు అప్లై చేయొచ్చు. మరిన్ని వివరాలకు www.ncert.nic.in చూడండి.

Similar News

News February 4, 2026

APPLY NOW: RRBలో 22,195 పోస్టులు

image

RRB 22,195 గ్రూప్ డీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. టెన్త్, ఐటీఐ అర్హత గలవారు మార్చి 2 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు రూ.18వేలు చెల్లిస్తారు. CBT, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PwBD, మహిళలకు రూ.250. వెబ్‌సైట్: https://www.rrbcdg.gov.in/

News February 4, 2026

ఫేస్‌వాష్ ఎందుకు వాడాలంటే?

image

కాలుష్యం, సూర్యరశ్మి, మేకప్ ప్రభావం ముఖంపై పడుతుంది. కాబట్టి రోజుకు రెండుసార్లు ఫేస్‌వాష్ చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే చాలామంది ఫేస్‌వాష్ చెయ్యడానికి సబ్బునే వాడతారు. కానీ సబ్బులో ఉండే రసాయనాల వల్ల ముఖంపై ఉండే pH దెబ్బతింటుదంటున్నారు నిపుణులు. ఫేస్‌వాష్‌లు చర్మాన్ని మృదువుగా శుభ్రపరచడంతో పాటు లోతుగా క్లీన్ చేస్తాయి. ఫేస్‌వాష్ ద్వారా pH బ్యాలెన్స్ సరిగ్గా మెయింటైన్ అవుతుందంటున్నారు నిపుణులు.

News February 4, 2026

యోగ, ధ్యానం, మంత్రం.. వీటితో సంపూర్ణ ఆరోగ్యం

image

మన శరీరంలో 7 శక్తి కేంద్రాలు(చక్రాలు) ఉంటాయి. ఇవి ప్రాణశక్తికి మూలాధారాలు. ఇవి సమతుల్యంగా ఉంటేనే మనసు ప్రశాంతంగా, శరీరం తేజోవంతంగా ఉంటుంది. కానీ ఒత్తిడి వల్ల కొన్నిసార్లు బ్లాక్ అవుతాయి. తద్వారా అశాంతి, అనారోగ్యం కలుగుతాయి. అయితే యోగ, ధ్యానం, మంత్ర పఠనం ద్వారా ఈ అంతర్గత శక్తులను ఉత్తేజితం చేయవచ్చు. ఫలితంగా ఆత్మబలాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. పూర్తి వివరాల కోసం క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.