News February 27, 2026
NCERT బుక్‌లో ఏముంది?

‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే పాఠ్యాంశంలో సుప్రీంకోర్టులో 81వేలు, హైకోర్టుల్లో 62 లక్షలు, జిల్లా, కింది కోర్టుల్లో 4.70 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని <<19224324>>NCERT<<>> పేర్కొంది. జడ్జిల కొరత, మౌలిక సౌకర్యాలు లేమి, సంక్లిష్టమైన న్యాయప్రక్రియలే దీనికి కారణమని తెలిపింది. న్యాయమూర్తులకూ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుందని.. 2017-21 మధ్య వారిపై 1,600 ఫిర్యాదులు వచ్చాయని వివరించింది. కాగా దీనిని CJI <<19243239>>బ్యాన్<<>> చేశారు.
Similar News
News February 27, 2026
ఇళ్లు రాని వాళ్లంతా అప్లై చేసుకోవాలి: CBN

AP: పేదలందరికీ 2029 నాటికి ఉచితంగా ఇళ్లు, ఇళ్ల స్థలాలు అందిస్తామని CM CBN అసెంబ్లీలో వెల్లడించారు. ‘ఇళ్లు రాని వాళ్లంతా దరఖాస్తు చేసుకోవాలి. 2.20 లక్షల కుటుంబాలకు ఇంటి జాగాలు లేవు. వారికి పట్టణ ప్రాంతాల్లో 2, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఉచితంగా కేటాయిస్తాం ఈ ఏడాదిలో 10.63 లక్షల ఇళ్లలో గృహ ప్రవేశాలు చేయిస్తాం. గత పాలకులు హౌసింగ్‌లో అక్రమాలు చేశారు. ఇందుకు బాధ్యులను శిక్షిస్తాం’ అని పేర్కొన్నారు.
News February 27, 2026
‘ది కేరళ స్టోరీ-2’ మూవీకి ఊరట

‘ది కేరళ స్టోరీ-2’ మూవీ విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. సినిమా విడుదలపై విధించిన స్టేను కేరళ హైకోర్టు ఎత్తివేసింది. నిన్న స్టే ఇస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కొట్టేసింది. సినిమాలో వివాదాస్పద అంశాలున్నాయని నిన్న HC పేర్కొంది. మూవీ చూడకుండానే CBFC సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టే విధించిన విషయం తెలిసిందే. కాగా మూవీ ఇవాళ రిలీజ్ కావాల్సి ఉంది.
News February 27, 2026
నిజంగా కస్టడీలో కొట్టి ఉంటే..: PV సునీల్

AP: క్రికెట్ ఆడుతూ <<19249263>>గాయపడ్డ<<>> డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై IPS ఆఫీసర్ PV సునీల్ కుమార్ సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘జస్ట్ అలా పడిపోతేనే రెండు చోట్ల ఎముకలు విరిగాయి. నిజంగా కస్టడీలో ఎవరైనా కొట్టి ఉంటే ఎన్ని ఫ్రాక్చర్లు ఉండాలి? అది కూడా ఆయన వర్ణించిన అంత దారుణంగా కొడితే? అబద్ధాలు బయట పడుతున్నాయి. నిజం దాగదు’ అని తెలిపారు. కాగా సునీల్ తనను కస్టడీలో టార్చర్ చేశారని RRR కేసు వేసిన విషయం తెలిసిందే.


