News August 31, 2024
వయాకాం 18, వాల్ట్ డిస్నీ విలీనానికి NCLT ఆమోదం

వయాకాం 18, వాల్ట్ డిస్నీ అనుబంధ స్టార్ ఇండియా సంస్థల విలీనానికి ఎన్సీఎల్టీ ఆమోదం తెలిపింది. ఈ విలీనంతో ఏర్పడే సంస్థ రూ.70 వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థగా నిలవనుంది. ఈ ఒప్పందంలో రిలయన్స్, దాని అనుబంధ సంస్థలు 63.16 శాతం, వాల్ట్ డిస్నీ 36.84 శాతం వాటా కలిగి ఉంటాయి. రెండు సంస్థల వెంచర్ పరిధిలో 120 టీవీ ఛానళ్లు, 2 ఓటీటీలు నడవనున్నాయి.
Similar News
News November 2, 2025
కీలక వికెట్లు కోల్పోయిన భారత్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో భారత్ కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (25), గిల్ (15), కెప్టెన్ సూర్య (24) ఔటయ్యారు. తిలక్ వర్మ, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమ్ ఇండియా స్కోర్ 8 ఓవర్లలో 82/3గా ఉంది. సూర్య సేన విజయానికి మరో 72 బంతుల్లో 105 రన్స్ అవసరం. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
News November 2, 2025
సన్నబియ్యంలో కేంద్రం వాటా రూ.42, రాష్ట్రానిది రూ.15: కిషన్ రెడ్డి

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే సన్నబియ్యం రద్దవుతాయని సీఎం రేవంత్ ప్రజలను బెదిరిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి బెదిరింపు రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. సన్నబియ్యం స్కీమ్ కేంద్రానిదని, కేజీకి మోదీ సర్కారు రూ.42 ఇస్తే, రాష్ట్రం వాటా రూ.15 మాత్రమే అని పేర్కొన్నారు.
News November 2, 2025
లైవ్ కాన్సర్ట్.. 73 ఫోన్లు కొట్టేశారు

ప్రముఖ స్పానిష్ పాప్ సింగర్, గ్రామీ అవార్డు విజేత ఎన్రిక్ ఇగ్లేసియాస్ ఇటీవల ముంబైలో నిర్వహించిన లైవ్ కాన్సర్ట్‌లో దొంగలు చేతివాటం చూపించారు. రూ.23.85 లక్షల విలువైన 73 ఫోన్లను కొట్టేశారు. ఈ విషయంపై ఇప్పటి వరకు 7 FIRలు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. గత బుధవారం ముంబైలోని MMRDA గ్రౌండులో జరిగిన ఈ కాన్సర్ట్ ఎంట్రీకి మినిమం టికెట్ ధర రూ.7వేలు. 25వేల మందికి పైగా హాజరయ్యారు.


