News March 24, 2024

NDA కూటమిలో కొలిక్కిరాని విజయవాడ పశ్చిమ పంచాయితీ

image

విజయవాడ పశ్చిమ నుంచి పోటీచేసే NDA కూటమి అభ్యర్థిపై ఇంకా సస్పెన్స్ వీడకపోవడంతో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. జనసేన నేత మహేష్‌కు ఇవ్వాలని JSP క్యాడర్ బలంగా కోరుతుండగా, పొత్తులో భాగంగా ఆ స్థానం బీజేపీకి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో గత కొద్దిరోజులుగా విజయవాడ నగరంలో మహేష్ అనుచరులు తమ విజ్ఞప్తిని పరిశీలించాలని జనసేన అధిష్ఠానానికి పలు రీతుల్లో నిరసన తెలుపుతున్నారు.

Similar News

News November 10, 2024

రేపు విజయవాడకు సీఎం చంద్రబాబు

image

భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినం సందర్భంగా రేపు సోమవారం విజయవాడలో మైనార్టీ సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరవుతారని ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మస్తాన్ వలీ తెలిపారు. కార్యక్రమంలో ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసినవారికి, పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులకు అవార్డులను ప్రదానం చేస్తామన్నారు.

News November 10, 2024

ఈ స్వామికి నిత్యం దీపదూప నైవేద్యాలు 

image

మోపిదేవి మండలం కొత్తపాలెంలో కృష్ణానది ఒడ్డున ఉన్న దుర్గాకోటేశ్వరస్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో స్వామివారికి నిత్యం దీపధూప నైవేద్యాలతో పూజలు చేస్తారు. పిల్లలు లేనివారు ఈ స్వామికి మొక్కులు తీర్చుకుంటే సంతానం కలుగుతుందని, కార్తిక మాసంలో ఇక్కడి నదిలో స్నానమాచరించి దీపాలు వెలిగిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తులు చెబుతున్నారు. ప్రతి శివరాత్రికి ఇక్కడ జాతర చేస్తారు. ఇక్కడే మరిన్ని ఆలయాలున్నాయి.

News November 10, 2024

కృష్ణా: D.El.Ed పరీక్షల హాల్ టికెట్లు విడుదల

image

డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(D.El.Ed) 2వ ఏడాది విద్యార్థులు(2018- 20 స్పాట్& మేనేజ్‌మెంట్ బ్యాచ్) రాయాల్సిన సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు శనివారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలు ఈ నెల 14 నుంచి 20 తేదీలలో ఉదయం 9-12 గంటల మధ్య జరుగుతాయని సంచాలకులు కేవీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను https://www.bse.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన సూచించారు.