News November 23, 2024
2024 ఏడాదికి శుభం కార్డు వేసిన NDA
BJP, దాని మిత్రపక్షాలు 2024ను భారీ విజయాలతో ముగించాయి. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి NDA మూడోసారి అధికారాన్ని చేపట్టడం తెలిసిందే. AP, బిహార్లో కొత్త మిత్రులను కలుపుకొని అనూహ్య విజయాలను అందుకుంది. హరియాణా, మహారాష్ట్రలో దక్కిన భారీ విజయాలు NDAను తిరుగులేని శక్తిగా నిలిపాయి. ఝార్ఖండ్ను BJP మళ్లీ చేజార్చుకుంది. JKలో అధికారం దక్కకపోయినా జమ్మూలో పట్టునిలుపుకొని 2024ను NDA ఘనంగా ముగించింది.
Similar News
News December 26, 2024
షేక్ హసీనా భవిష్యత్తు ఎటు?
భారత్లో ఆశ్రయం పొందుతున్న బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా భవితవ్యం ఆసక్తికరంగా మారింది. యూనస్ సర్కారు ఆమెను అప్పగించాలని భారత్ను అడిగిన నేపథ్యంలో హసీనా పూర్తిగా భారత్ దయపై ఆధారపడ్డారు. శరణార్థుల అప్పగింత ఒప్పందం ప్రకారం హసీనాను భారత్ అప్పగించాల్సి ఉన్నా.. యూనస్ భారత వ్యతిరేక వైఖరి కారణంగా హసీనాకు రక్షణ కల్పించేందుకే భారత్ నిర్ణయించుకునే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
News December 26, 2024
జైల్లో అల్లర్లు: 1500మంది పరారీ.. 33మంది మృతి
మొజాంబిక్ రాజధాని మపూటోలోని ఓ జైల్లో తాజాగా చెలరేగిన అల్లర్లలో 1534మంది క్రిమినల్స్ జైలు నుంచి పరారు కాగా 33మంది మృతిచెందారు. 15మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎన్నికల్లో అధికార పార్టీదే విజయమని ఆ దేశ సుప్రీం కోర్టు ప్రకటించడంతో ప్రతిపక్షాలు మొదలుపెట్టిన అల్లర్లు జైలు వరకూ విస్తరించాయి. 150మందిని తిరిగి పట్టుకున్నామని, మిగిలిన ఖైదీల కోసం గాలింపు చేపట్టామని అధికారులు తెలిపారు.
News December 26, 2024
సీఎం తన తమ్ముడిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు: హరీశ్
TG: సంధ్య థియేటర్ ఘటనను ప్రభుత్వం రాజకీయం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సినిమా వాళ్లను భయపెట్టి CM మంచి చేసుకోకూడదని హితవు పలికారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను ఆయన పరామర్శించారు. రాష్ట్రంలో ఓ సర్పంచి ఆత్మహత్యకు కారణమైన CM తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేయడంలేదని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానమన్న ముఖ్యమంత్రి, తన తమ్ముడిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ధ్వజమెత్తారు.