News November 23, 2024
ఆధిక్యంలో ఎన్డీయే
మహారాష్ట్ర, ఝార్ఖండ్లో ఓట్ల కౌంటింగ్ మొదలైంది. ఎర్లీ ట్రెండ్స్లో రెండు చోట్ల ఎన్డీయే ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో మహాయుతి 8 చోట్ల, మహా వికాస్ అఘాడీ 6 చోట్ల లీడింగ్లో ఉన్నాయి. ఝార్ఖండ్లో ఎన్డీఏ 6, ఇండియా కూటమి 3 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి.
Similar News
News November 23, 2024
భారీగా పెరిగిన బంగారం ధర
బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న రేట్లు ఇవాళ మరోసారి భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) రూ.820 పెరిగి రూ.79,640కి చేరింది. 22 క్యారెట్ల బంగారం (10గ్రాములు) రూ.750 పెరిగి రూ.73,000కి చేరింది. వెండి ధర కిలో రూ.1,01,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News November 23, 2024
ప్రియాంకా గాంధీ అత్యధిక మెజారిటీతో గెలుస్తారు: రేవంత్ రెడ్డి
TG: కేరళ వయనాడ్లో జరిగిన ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ఆది నుంచీ ఆధిక్యంలో కొనసాగుతుండటంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వయనాడ్ ప్రజలు ఆమెను కచ్చితంగా రికార్డు మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపిస్తారని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ప్రియాంక ఇప్పటికే 2లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం దిశగా దూసుకెళ్తున్నారు.
News November 23, 2024
ప్రియాంక మెజార్టీ 2,00,000+
వయనాడ్లో ప్రియాంక గాంధీ బంపర్ విక్టరీ ఖాయమని స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఆమె మెజార్టీ 2 లక్షలు దాటింది. దీంతో కాంగ్రెస్ ప్రముఖులు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. కాగా కాంగ్రెస్ కంచుకోటలో పోటీ చేస్తున్న నవ్య హరిదాస్ మూడో స్థానానికి పరిమితమయ్యారు.