News June 4, 2024
మూడోసారి ఎన్డీఏ అధికారం చేపట్టబోతోంది: మోదీ

ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు ప్రధాని మోదీ. ‘ఎన్డీఏ కూటమికి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈ సంగ్రామంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ గెలిచింది. మూడోసారి ఎన్డీఏ అధికారం చేపట్టబోతోంది. ఎన్నికల ఘట్టాన్ని విజయవంతంగా నిర్వహించిన ఈసీకి అభినందనలు. జమ్మూకశ్మీర్లో రికార్డ్ స్థాయిలో ఓటింగ్ జరిగింది. ఇది గర్వించదగ్గ విషయం’ అని మోదీ తెలిపారు.
Similar News
News December 21, 2025
20 రోజుల్లో మూడు సభలు నిర్వహించనున్న BRS

TG: రాబోయే 20 రోజుల్లో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలో మూడు సభలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. తొలుత మహబూబ్ నగర్(పాలమూరు) ఆ తర్వాత రంగారెడ్డి, నల్గొండలో సభలు నిర్వహించాలని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకుంది. కృష్ణా జలాల సాధనకై పోరు చేయాలని పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
News December 21, 2025
హిందువులంతా ఐక్యంగా ఉండాలి.. బంగ్లా దాడులపై మోహన్ భాగవత్

బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులనుద్దేశించి RSS చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడి హిందువులు ఐక్యంగా ఉండాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారు వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. హిందువులకు భారతదేశమే ఏకైక ఆశ్రయమని.. దీన్ని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రభుత్వం తరఫున మరిన్ని గట్టి చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు.
News December 21, 2025
పాకిస్థాన్తో ఫైనల్.. టీమ్ ఇండియా ఓటమి

అండర్-19 ఆసియాకప్ ఫైనల్: పాకిస్థాన్తో మ్యాచులో టీమ్ఇండియా ఘోర పరాజయం పాలైంది. సీజన్ మొత్తం అదరగొట్టిన ఆయుశ్ సేన కీలక మ్యాచులో చేతులెత్తేసింది. 348 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 156 పరుగులకే ఆలౌటైంది. దీంతో 191 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. హిట్టర్ సూర్యవంశీ(26), జార్జ్(16), అభిజ్ఞాన్(13) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. చివర్లో దీపేశ్ దేవేంద్రన్ (16 బంతుల్లో 36) దూకుడుగా ఆడారు.


