News December 24, 2024

రేపు ఎన్డీయే నేతల సమావేశం

image

ఢిల్లీలోని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో రేపు ఎన్డీయే నేతలు సమావేశం కానున్నారు. అంబేడ్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యల వివాదంపై ప్రధానంగా చర్చించనున్నారు. దాంతో పాటు జమిలి, వక్ఫ్ బిల్లులు, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ షేరింగ్‌పైనా మాట్లాడుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కూటమిలోని సీనియర్లందరూ ఈ సమావేశానికి హాజరవుతారని బీజేపీ వర్గాలు తెలిపాయి.

Similar News

News January 23, 2026

చిత్తూరు జిల్లాలో భూ సమస్యలే ఎక్కువ..!

image

చిత్తూరు జిల్లాలో ప్రతి సోమవారం జరిగే కలెక్టర్ గ్రీవెన్స్ డేకు అర్జీలు భారీగా వస్తున్నాయి. డిసెంబర్, జనవరి 19వ తేదీ వరకు ఒక్క రెవెన్యూ శాఖపైనే 1,238 అర్జీలు అందాయి. డిసెంబర్‌లో 742 ఫిర్యాదులకు 638 పరిష్కరించి, 78 రిజెక్ట్ చేశారు. 26 పెండింగ్‌లో ఉన్నాయి. జనవరిలో 496 మంది భూ సమస్యలపై అర్జీలు ఇవ్వగా 290 పరిష్కరించి, 42 రిజెక్ట్ చేయగా.. 164 అర్జీలు పరిష్కరించాల్సి ఉంది.

News January 23, 2026

గోదావరి పుష్కరాలకు 10 కోట్ల మంది!

image

AP: 2027 జూన్ 26 నుంచి ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాలకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని CM CBN అధికారులను ఆదేశించారు. 3వ సారి ఈ పుష్కరాలు నిర్వహిస్తుండడం తన అదృష్టమని వ్యాఖ్యానించారు. ‘పోలవరం’ పనులు ఈలోగా పూర్తిచేయాలన్నారు. పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలన్నారు. పుష్కరాలకు 10కోట్ల మంది వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

News January 23, 2026

వంట గది ఏ వైపున ఉండాలి?

image

వంటగది ఇంటి ఆగ్నేయ మూలలో ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. దీనివల్ల సరిపడా గాలి, వెలుతురు వచ్చి ఇల్లాలు అలసట లేకుండా వంట చేయగలదని చెబుతున్నారు. ‘వంటగదిలో పూజ గది ఉండటం శ్రేయస్కరం కాదు. శుభ్రంగా ఉంచుకోవాలి. విరిగిన, పగుళ్లు ఇచ్చిన గాజు, పింగాణీ పాత్రలను ఉంచకూడదు. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే వంట రుచికరంగా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>