News April 30, 2024

నేడు NDA మేనిఫెస్టో విడుదల

image

AP: టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మేనిఫెస్టో నేడు విడుదల కానుంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మధ్యాహ్నం 12 గంటలకు CBN, పవన్, ఇతర బీజేపీ నేతలు మేనిఫెస్టో ప్రకటించనున్నారు. పెన్షన్లు రూ.4వేలకు పెంపు, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, మెగా డీఎస్సీపై మొదటి సంతకం, వాలంటీర్ల వేతనం రూ.10వేలకు పెంపు వంటి హామీలతో NDA అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు.

Similar News

News January 24, 2026

టాస్ గెలిచిన ఇండియా

image

U19 వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మరి కాసేపట్లో న్యూజిలాండ్ బ్యాటింగ్ ప్రారంభం కానుంది. వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది. గ్రూప్-బిలో ఉన్న టీమ్ ఇండియా ఇప్పటికే ఆడిన 2 మ్యాచుల్లో గెలిచి సూపర్ సిక్స్‌కు క్వాలిఫై అయింది.
IND: వైభవ్, ఆయుష్ మాత్రే(C), వేదాంత్, విహాన్, కుందు, ఆరోన్, కనిష్క్, అంబరీశ్, ఖిలాన్, హెనిల్, ఎనాన్

News January 24, 2026

ఈ సంకేతాలు కనిపిస్తే.. మొబైల్ మార్చే టైం వచ్చేసినట్టే!

image

☛ సేఫ్టీకి అతి ముఖ్యమైన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఆగిపోవడం
☛ వాట్సాప్, ఫేస్‌బుక్, బ్యాంకింగ్ యాప్స్ క్రాష్/స్లో కావడం
☛ ఛార్జింగ్ త్వరగా పడిపోవడం
☛ ఎక్కువసార్లు ఛార్జ్ చేయాల్సి రావడం
☛ మొబైల్ స్లో కావడం
– కాల్స్ చేసేటప్పుడు కూడా హ్యాంగ్ అవుతుంటే మీరు మొబైల్ మార్చాల్సిన టైం వచ్చేసినట్టేనని గుర్తించండి.

News January 24, 2026

ఆస్ట్రేలియాతో టెస్ట్.. భారత జట్టు ప్రకటన

image

ఉమెన్స్: ఆస్ట్రేలియాతో పెర్త్‌లో మార్చి 6వ తేదీ ఆడనున్న ఒకే ఒక టెస్ట్ మ్యాచ్‌కు 15 మందితో కూడిన భారత జట్టును BCCI ప్రకటించింది. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.
జట్టు: హర్మన్ ప్రీత్ కౌర్(C), స్మృతి మంధాన(VC), షెఫాలీ, జెమీమా, అమన్‌జోత్, రిచా, ఉమ, ప్రతికా రావల్, హర్లీన్, దీప్తి, రేణుక, స్నేహ్ రాణా, క్రాంతి, వైష్ణవి, సయాలి.