News October 12, 2025
బిహార్‌లో NDA సీట్ల షేరింగ్.. ఏ పార్టీకి ఎన్నంటే?

బిహార్‌లో NDA సీట్ల షేరింగ్‌ను ఆ రాష్ట్ర బీజేపీ ఇన్‌ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. మొత్తం 243 సీట్లలో బీజేపీకి 101, JDU 101, LJP (R) 29, రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM)కి 6, హిందుస్తానీ అవామ్ మోర్చా (HAM)కు 6 సీట్లు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మళ్లీ NDA ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రంలో రెండు విడతల్లో(నవంబర్ 6, 11 తేదీల్లో) ఎన్నికలు జరగనున్నాయి.
Similar News
News October 12, 2025
రేపు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు: APSDMA

AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు పలు జిల్లాలకు APSDMA వర్షసూచన చేసింది. సోమవారం అల్లూరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News October 12, 2025
మా పార్టీ వాళ్లనూ సస్పెండ్ చేశాం: చంద్రబాబు

AP: కొందరు రాజకీయ ముసుగులో నేరాలు చేయడానికి అలవాటు పడ్డారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ‘నకిలీ మద్యం కేసులో మా పార్టీ వాళ్లపై ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేశాం. ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఇప్పటివరకు 23 మంది నిందితులను గుర్తించాం. 16 మందిని అరెస్ట్ చేశాం. ఇబ్రహీంపట్నం కేసులోనూ 12 మంది నిందితులను గుర్తించగా ఏడుగురిని అరెస్టు చేశారు. 4 పీటీ వారెంట్‌లు నమోదయ్యాయి’ అని సీఎం వివరించారు.
News October 12, 2025
బెల్ట్ షాపులు నిర్వహిస్తే బెల్ట్ తీస్తాం: చంద్రబాబు

AP: రాష్ట్రంలో ఎక్కడైనా బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మితే బెల్ట్ తీస్తామని CM CBN హెచ్చరించారు. నకిలీ మద్యం కేసుకు సంబంధించి నెల్లూరు రేంజ్ IG అశోక్ కుమార్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేశామన్నారు. వ్యాపారం పేరుతో నకిలీ మద్యం తయారు చేస్తామంటే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు కల్తీ మద్యాన్ని గుర్తించేందుకు ‘AP ఎక్సైజ్ సురక్షా యాప్’ను రిలీజ్ చేశారు. యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా యాప్‌ను తీర్చిదిద్దామన్నారు.