News June 4, 2024
NDA vs INDIA: క్రాష్ అవుతున్న స్టాక్ మార్కెట్లు

ఎర్లీ ట్రెండ్స్ సరళిని గమనిస్తే ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. పోటీ ఏకపక్షంగా లేకపోవడంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీ పతనం దిశగా సాగుతున్నాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 612 పాయింట్ల నష్టంతో 22,651, బీఎస్ఈ సెన్సెక్స్ 2117 పాయింట్లు పతనమై 74,313 వద్ద కొనసాగుతున్నాయి. బ్యాంకు నిఫ్టీ 1440 పాయింట్లు ఎరుపెక్కి 49,539 వద్ద ఉన్నాయి. ప్రస్తుత పతనంతో మదుపర్లు రూ.6 లక్షల కోట్లు నష్టపోయారు.
Similar News
News December 5, 2025
రైతన్నా.. ఈ పురుగుతో జాగ్రత్త

ఖరీఫ్ పంట కోతలు, రబీ పంట నాట్ల వేళ ఏపీ వ్యాప్తంగా 800కు పైగా స్క్రబ్టైఫస్ కేసులు నమోదవ్వడం కలవరపెడుతోంది. చిగ్గర్ అనే పురుగు కాటుకు గురైనవారు తీవ్రజ్వరం, ఒంటి నొప్పులు, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిపాలవుతున్నారు. పొలాలు, అడవులు, తడి నేల, పశువుల మేత ప్రాంతాల్లో పని చేసేవారికి ఈ పురుగుకాటు ముప్పు ఎక్కువగా ఉంది. స్క్రబ్ టైఫస్ లక్షణాలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 5, 2025
రో-కో భవిష్యత్తును వారు నిర్ణయించడం దురదృష్టకరం: హర్భజన్

తమ కెరీర్లో పెద్దగా ఏం సాధించని వారు రోహిత్, కోహ్లీ భవిష్యత్తును నిర్ణయిస్తుండటం దురదృష్టకరమని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ వ్యాఖ్యానించారు. తనతో పాటు తన సహచరులకు ఇలాంటి పరిస్థితే ఎదురైందని చెప్పారు. రోహిత్, కోహ్లీ నిరంతరం పరుగులు చేస్తూ బలంగా ముందుకు సాగుతున్నారన్నారు. AUS సిరీస్కు ముందు నుంచే కోచ్ గంభీర్తో ‘రో-కో’కు పడట్లేదన్న పుకార్ల నడుమ భజ్జీ వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.
News December 5, 2025
స్క్రబ్ టైఫస్ వ్యాధిని ఈ లక్షణాలతో గుర్తించండి

AP: స్క్రబ్ టైఫస్ను వ్యాప్తి చేసే చిగ్గర్ పురుగు మనిషిని కుట్టినచోట నల్లని మచ్చ, దద్దుర్లు ఏర్పడతాయి. తర్వాత తీవ్రమైన జ్వరం, చలి, ఒళ్లు నొప్పులు ఉంటాయి. తలనొప్పి, అలసట, వాంతులు, విరేచనాలు లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో గుర్తించి చికిత్స అందించకపోతే ఊపిరితిత్తులు, కిడ్నీలు, మెదడు, కాలేయం, ఇతర అవయవాలపై ప్రభావం చూపి రోగి క్రమంగా కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇది అంటువ్యాధి కాదని వైద్యులు తెలిపారు.


