News September 12, 2025

2029లో వచ్చేది NDAనే: చంద్రబాబు

image

AP: దేశంలో, రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లోనూ ఎన్డీయే కూటమే అధికారంలోకి వస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. 2029లో నరేంద్రమోదీ నాలుగోసారి పీఎం అవుతారని Way2News కాన్‌క్లేవ్‌లో పేర్కొన్నారు. ఆలస్యంగా సాధించే విజన్ 2020, 2047 వంటి సుదీర్ఘ లక్ష్యాల వల్ల రాజకీయంగా నష్టమేమీ ఉండదని స్పష్టం చేశారు. తమ భవిష్యత్తు విజయాలపై సందేహం అవసరం లేదని, ఇది రాసిపెట్టుకోవాలని అన్నారు.

Similar News

News March 28, 2026

ఇది మీ రాష్ట్రం కాదు, వెళ్లిపోవాలన్నారు: పవన్

image

AP: తన అన్నయ్యతో పాటు కుటుంబమంతా మద్రాసులో ఆస్తులన్నీ అమ్మేసుకొని హైదరాబాద్ వచ్చామని అమరావతికి చట్టబద్ధత చర్చ సందర్భంగా అసెంబ్లీలో Dy.CM పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ‘HYD వచ్చాకా అదే సమస్య. కారణాలేవైనా కావచ్చు. కానీ ఇది మీ ఊరు కాదు, మీ రాష్ట్రం కాదు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అన్నారు. రాష్ట్ర విభజన రాజకీయ పరమైన సమస్య అని అనుకునేవాడిని కానీ ప్రజలపైనా తీవ్ర ప్రభావం చూపింది’ అని తెలిపారు.

News March 28, 2026

రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం.. చెక్ చేసుకోండి!

image

పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందించేందుకు కేంద్రం ‘ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని అమలుచేస్తోంది. దీనిద్వారా అర్హులైన ప్రతి కుటుంబం ఏడాదికి రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం పొందవచ్చు. అయితే దీనికి అర్హులో కాదో చెక్ చేసుకొని అప్లై చేసుకోవాలని కేంద్రం సూచించింది. <>WWW.PMJAY.gov.in<<>> లేదా యాప్‌ ద్వారా ప్రాథమిక వివరాలతో అర్హులో కాదో చెక్ చేసుకోవాలి. ఆధార్ KYCతో అప్లై చేసుకోండి.

News March 28, 2026

జియోలో 30 రోజుల కొత్త ప్లాన్స్ తెలుసా!

image

JIO నుంచి 30 రోజుల స్పెషల్ రీఛార్జ్ ప్లాన్స్ మరో 2 అందుబాటులోకి వచ్చాయి. రూ.365, రూ.355 ప్యాక్స్‌తో రీఛార్జ్ చేస్తే 30 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, 100 SMS, 25GB డేటా, 3 నెలల పాటు JIO హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. డేటా పూర్తయినా 64kbps స్పీడ్‌తో డేటాను వినియోగించుకోవచ్చు.