News October 6, 2025
బిహార్‌లో విజయం NDAదే: Matrize Opinion Poll

బిహార్‌లో ఎన్డీయే ఘన విజయం సాధిస్తుందని Matrize Opinion Poll అంచనా వేసింది. NDA (బీజేపీ, జేడీయూ)కి 150-160 సీట్లు వస్తాయని, మహాఘట్‌బంధన్ (ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు) 70-85 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొంది. ఎన్డీయేకి 49%, మహాఘట్‌బంధన్‌కు 36% ఓట్లు పోలవుతాయని తెలిపింది. ప్రశాంత్ కిశోర్ జన్ సూరజ్ పార్టీకి 2-5 సీట్లు వస్తాయని వివరించింది.
Similar News
News October 6, 2025
ప్రభుత్వ పెద్దల అండతోనే కల్తీ మద్యం రాకెట్: YCP

AP: కల్తీ మద్యం రాకెట్‌తో ప్రభుత్వ పెద్దలకు లింకులున్నాయని YCP నేత జూపూడి ప్రభాకర్‌రావు ఆరోపించారు. ‘టీడీపీ నేతలే కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. అందుకోసమే ప్రభుత్వ ఆధ్వర్యంలోని మద్యం షాపుల పాలసీని రద్దుచేశారు. ప్రభుత్వ పెద్దల అండ లేకుండా ఇదంతా జరుగుతుందా? CBN దీనిపై వివరణ ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. జిల్లాల్లో కల్తీ లిక్కర్ డెన్లను ఏర్పాటుచేసి ఆదాయాన్ని వాటాలుగా పంచుకుంటున్నారని దుయ్యబట్టారు.
News October 6, 2025
ఎన్నికల కమిషన్‌పై KTR వ్యంగ్యాస్త్రాలు

TG: బిహార్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించడంపై BRS నేత KTR వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘వెల్ డన్ ECI. ముందు SIRతో భారీ స్థాయిలో ఓట్లను తొలగించింది. ఆ తర్వాత ఎన్నికల ముందు 1.21 కోట్ల మంది మహిళా ఓటర్లకు <<17929774>>లంచం<<>> ఇచ్చేందుకు NDA ప్రభుత్వానికి అనుమతిచ్చింది. ఇప్పుడు ఫ్రీ & ఫెయిర్ ఎలక్షన్స్ అని చెబుతోంది. వెరీ వెల్ డన్’ అంటూ సెటైర్ వేశారు.
News October 6, 2025
చైనా వెపన్స్ అద్భుతంగా పనిచేశాయి: పాక్ LG

ఆపరేషన్ సిందూర్‌లో చైనా మేడ్ వెపన్స్ అద్భుతంగా పనిచేశాయని పాక్ లెఫ్టినెంట్ జనరల్(LG) అహ్మద్ షరీఫ్ చౌదరీ అన్నారు. ‘మేం అన్ని రకాల సాంకేతికతను వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇటీవల చైనీస్ ప్లాట్‌ఫామ్స్ అద్భుత సామర్థ్యాన్ని ప్రదర్శించాయి’ అని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. కాగా చైనాకు చెందిన PL-15, HQ-9P సహా అన్ని రకాల మిస్సైళ్లను భారత డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా కూల్చేసిన విషయం తెలిసిందే.