News March 24, 2024

NDA కూటమిలో కొలిక్కిరాని విజయవాడ పశ్చిమ పంచాయితీ

image

విజయవాడ పశ్చిమ నుంచి పోటీచేసే NDA కూటమి అభ్యర్థిపై ఇంకా సస్పెన్స్ వీడకపోవడంతో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. జనసేన నేత మహేష్‌కు ఇవ్వాలని JSP క్యాడర్ బలంగా కోరుతుండగా, పొత్తులో భాగంగా ఆ స్థానం బీజేపీకి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో గత కొద్దిరోజులుగా విజయవాడ నగరంలో మహేష్ అనుచరులు తమ విజ్ఞప్తిని పరిశీలించాలని జనసేన అధిష్ఠానానికి పలు రీతుల్లో నిరసన తెలుపుతున్నారు.

Similar News

News April 18, 2025

బాపులపాడు: మార్కెట్‌కి వెళ్తుండగా ప్రమాదం.. ఒకరి మృతి

image

బాపులపాడు మండలం వేలేరు వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేలేరు వద్ద కారు ఢీ కొనడంతో బైక్‌పై వెళ్తున్న బాబు అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఇతను తేలప్రోలులో పట్టుగూళ్ల రీలింగ్ యూనిట్‌ని నిర్వహిస్తుంటాడు. పట్టుగూళ్ల కోసం హనుమాన్ జంక్షన్ మార్కెట్‌కు వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

News April 18, 2025

ఘంటసాల: అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు..!

image

 ఘంటసాల పరిధిలోని పాప వినాశనం వద్ద విషాదం చోటుచేసుకుంది. గురువారం KEB కాలువలో పదో తరగతి విద్యార్థి పవన్ గల్లంతయ్యాడు. దురదృష్టవశాత్తూ ఇదే స్థలంలో 11 ఏళ్ల క్రితం పవన్ తండ్రి కూడా మృతి చెందారు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న కుమారుడు కాలువలో కొట్టుకుపోవడంతో తల్లి గుండెలు అవిసేలా రోధిస్తోంది. గ్రామస్థులు పవన్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

News April 18, 2025

హనుమాన్ జంక్షన్‌లో తనిఖీలు చేసిన ఎస్పీ

image

రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు గురువారం రాత్రి జిల్లావ్యాప్తంగా పోలీసులు నాకాబందీ నిర్వహించారు. హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెరికేడు అండర్ పాస్ వద్ద జరిగిన నాకాబందిలో పాల్గొన్న జిల్లా ఎస్పీ గంగాధరరావు స్వయంగా వాహన తనిఖీలు చేశారు. వాహన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి వారు ఎక్కడ నుంచి వస్తున్నది అడిగి తెలుసుకున్నారు.

error: Content is protected !!