News February 1, 2026
NDDB రిపోర్టు వచ్చాకే జంతు కొవ్వులు ఉన్నాయని చెప్పా: చంద్రబాబు

AP: కల్తీ నెయ్యి ఘటనపై NDDB రిపోర్టు వచ్చాకే తాను మాట్లాడానని సీఎం చంద్రబాబు చెప్పారు. అందులో జంతు కొవ్వులు ఉన్నాయని, కల్తీ చేశారని అప్పుడే చెప్పానన్నారు. దీనిపై వైసీపీ నేతలు నానాయాగి చేసి సుప్రీంకోర్టుకు వెళ్లారని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమల పవిత్రతను కాపాడేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. వేంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే ఈ జన్మలోనే అనుభవిస్తారని హెచ్చరించారు.
Similar News
News February 1, 2026
ఫోన్ ట్యాపింగ్: అధికారులతో మొదలై కేసీఆర్ వరకు..

TG: రెండేళ్లుగా కొనసాగుతోన్న ఫోన్ ట్యాపింగ్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. తొలుత SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, అధికారులను విచారించి, అరెస్టు చేసిన సిట్.. ఆ తర్వాత నాయకులపై ఫోకస్ పెట్టింది. పలువురిని సాక్షులుగా, ఇంకొందరిని నిందితులుగా విచారణ చేసింది. చివరికి ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ విచారణ వరకు చేరింది. ఫోన్ ట్యాపింగ్ సర్వసాధారణమని BRS స్పష్టం చేస్తుండగా, ఇది అక్రమ చర్య అని ప్రభుత్వం పేర్కొంటోంది.
News February 1, 2026
ఈ నియమాలు తెలియకుండానే నదిలో నాణేలు వేస్తున్నారా!

నదిలో నాణేలు వేయడానికి ఆది/మంగళ వారాలు ప్రశస్తమైనవని పండితులు చెబుతున్నారు. ‘స్నానాంతరం శుభ్రమైన వస్త్రాలు ధరించి, తూర్పు ముఖంగా ఉంటూ, కులదైవాన్ని ప్రార్థిస్తూ ఈ పరిహారం పాటించాలి. రాగి నాణేన్ని ప్రవహించే నీటిలోనే వేయాలి. అది నీటి ప్రవాహంతో పాటు ముందుకు సాగిపోతే జాతక దోషాలు తొలగి అధిక పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. పూర్వం నీటి శుద్ధి కోసం రాగిని వాడే ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది’ అంటున్నారు.
News February 1, 2026
గ్లోబల్ గ్రోత్‌లో ఇండియా ‘పవర్’… మస్క్ ఫిదా!

ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు వస్తున్నాయని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. లేటెస్ట్ IMF డేటా ప్రకారం ప్రపంచ వృద్ధిలో ఇండియా 17% వాటాతో అమెరికా (9.9%) కంటే చాలా ముందుంది. చైనా, భారత్ కలిపి గ్లోబల్ గ్రోత్‌లో దాదాపు 43.6% కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఈ గణాంకాలను షేర్ చేస్తూ, ప్రపంచ ఆర్థిక శక్తి ఇప్పుడు తూర్పు దేశాల వైపు మళ్లుతోందని ‘Balance of power is changing’ అంటూ మస్క్ ట్వీట్ చేశారు.


