News May 11, 2024
NDL: ప్రశాంత ఎన్నికల నిర్వహణ లక్ష్యం- కలెక్టర్, ఎస్పీ

జిల్లాలో మే 13న ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడమే తమ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు, ఎస్పీ కే.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
Similar News
News February 19, 2025
శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు.. ముఖ్యమైన అంశాలు!

● శ్రీశైలంలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
● అన్ని ఆర్జిత సేవలు రద్దు.. ప్రముఖులకు 4విడతలుగా బ్రేక్ దర్శనం
● 22న టీటీడీ తరఫున స్వామి, అమ్మవార్లకు వస్త్రాల అందజేత
● 23న సీఎం చంద్రబాబు పట్టువస్త్రాల సమర్పణ
● కాలినడక భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి
● శివరాత్రి రోజున ప్రభోత్సవం, పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కళ్యాణం
● భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం
● ఘాట్‌లో 24గంటల అనుమతి
● 453 స్పెషల్ బస్సులు ఏర్పాటు
News February 19, 2025
యూట్యూబర్ తిరుమల్ రెడ్డి హత్య

కర్నూలు జిల్లా మద్దికెరకు చెందిన యూట్యూబర్ తిరుమల్ రెడ్డి హత్యకు గురయ్యారు. రెండ్రోజుల క్రితం అదృశ్యమైన ఆయన గుంతకల్ మండలం కసాపురం సమీపంలోని హంద్రీనీవా కాలవలో శవమై తేలారు. పోలీసుల వివరాల మేరకు.. భూ వివాదమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. సంగాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో భూ వివాదం నడుస్తోందని, మృతుడి భార్య కూడా అతడిపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
News February 19, 2025
‘నక్షా’తో భూములకు శాశ్వత రక్ష: పాణ్యం ఎమ్మెల్యే

ప్రభుత్వ, ప్రైవేటు భూములకు కేంద్ర ప్రభుత్వ నేషనల్ జియో స్పాటియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్ (నక్షా) కార్యక్రమం శాశ్వత రక్షణ ఇస్తుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్, ఉమ్మడి రాష్ట్రాల సమన్వయకర్త బీసీ పరిదా అన్నారు. ఈ కార్యక్రమం కోసం కర్నూలు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక కావడం హర్షనీయమని ఎమ్మెల్యే తెలిపారు.