News July 8, 2025
సిగాచీలో ముగిసిన NDMA బృందం పరిశీలన

TG: పాశమైలారంలోని సిగాచీ ఫ్యాక్టరీలో NDMA బృందం పరిశీలన ముగిసింది. ప్రమాద స్థలాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పేలుడుకు గల కారణాలపై బృందం అధ్యయనం చేసింది. దీనిపై నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయనుంది. కాగా ఈ ఘటనలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 44కు చేరింది. ప్రమాదం జరిగి 9 రోజులవుతున్నా ఇంకా పలువురి ఆచూకీ లభ్యం కాలేదు.
Similar News
News August 31, 2025
రేపు గవర్నర్‌ను కలుస్తాం: పొన్నం

TG: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను రేపు కలవనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లు కోసం ప్రధాని మోదీ, రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదన్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తామన్నారు. BRS సహా అన్ని పార్టీల నేతలనూ గవర్నర్ వద్దకు తీసుకెళ్తామని చెప్పారు. BCలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్తామని, సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు పూర్తిచేస్తామని ఆయన స్పష్టం చేశారు.
News August 31, 2025
నటి ప్రియా మరాఠే కన్నుమూత

ప్రముఖ మరాఠీ నటి ప్రియా మరాఠే(38) ముంబైలోని తన నివాసంలో ఉదయం తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్‌తో కొన్నాళ్లు యాక్టింగ్‌కు విరామం తీసుకున్న ఆమె.. తగ్గిందని భావించి తిరిగి నటన ప్రారంభించారు. వ్యాధి ముదరడంతో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. ప్రియ 2006 నుంచి టీవీ పరిశ్రమలో ఉన్నారు. 20కిపైగా సీరియల్స్, 2 చిత్రాల్లో నటించారు. సుశాంత్ సింగ్‌తో కలిసి చేసిన ‘పవిత్ర్ రిష్తా’ అనే సీరియల్‌తో ఆమె పాపులరయ్యారు.
News August 31, 2025
తిరుపతిలో మహిళా పార్లమెంటేరియన్ల సమావేశం

AP: ఆధ్యాత్మిక నగరం తిరుపతి మహిళా పార్లమెంటేరియన్ల సమావేశానికి వేదిక కానుంది. SEP 14, 15 తేదీల్లో జరిగే ఈ సమావేశానికి పలు రాష్ట్రాల నుంచి 300మంది మహిళా MLAలు, MLCలు హాజరవనున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, CM CBN కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, 15న ముగింపు వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొంటారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. ఈ వేడుకలకు ఏపీ ఆతిథ్యం ఇవ్వడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.