News January 19, 2025

NDRF రైజింగ్ డే వేడుకలు.. పాల్గొననున్న షా, బాబు, పవన్

image

AP: నేడు విజయవాడ సమీపంలోని గన్నవరంలో NDRF రైజింగ్ డే వేడుకలు జరగనున్నాయి. ఇందులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. కొండపావులూరులో NDRF, SDRF ప్రాంగణాలను షా ప్రారంభించనున్నారు. అనంతరం HYD పోలీస్ అకాడమీలో రూ.27 కోట్లతో నిర్మించనున్న షూటింగ్ రేంజ్‌కు శంకుస్థాపన చేయనున్నారు.

Similar News

News January 19, 2025

LSG కెప్టెన్‌గా పంత్!

image

IPL-2025లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా రిషభ్ పంత్ వ్యవహరిస్తారని ESPN CRIC INFO పేర్కొంది. దీనిపై రేపు అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఆక్షన్‌లో అతడిని రూ.27కోట్లకు LSG కొనుగోలు చేసింది. స్క్వాడ్‌లో పూరన్, మార్క్రమ్, మిల్లర్ వంటి ప్లేయర్లున్నా స్వదేశీ కెప్టెన్ వైపే టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. పంత్ 2021, 2022, 2024 సీజన్లలో DCకి కెప్టెన్సీ చేసిన విషయం తెలిసిందే.

News January 19, 2025

తిరుమల తొక్కిసలాట ఘటనపై కేంద్ర హోంశాఖ దృష్టి పెట్టింది: షా

image

AP: విజయవాడలో రాష్ట్ర బీజేపీ నేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశం ముగిసింది. సుమారు గంటన్నర పాటు చర్చించి, కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. తిరుమల తొక్కిసలాట ఘటనపై కేంద్ర హోంశాఖ దృష్టి పెట్టిందన్నారు. ఏపీకి కేంద్రం అందిస్తున్న సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అంతర్గత విభేదాలను పక్కనబెట్టాలని సూచించారు. ‘హైందవ శంఖారావం’ విజయం పట్ల VHP, BJP నేతలను షా అభినందించారు.

News January 19, 2025

‘సంక్రాంతికి వస్తున్నాం’ కలెక్షన్ల సునామీ

image

విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.130+ కోట్ల కలెక్షన్లు రాబట్టగా నిన్నటితో కలిపి రూ.161కోట్లు వచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి. అయితే, కేవలం 5 రోజుల్లోనే రూ.100 కోట్ల షేర్ పొందడంతో బాక్స్ ఆఫీస్‌ను రూల్ చేస్తోందని వెల్లడించాయి. షోలు పెరిగినప్పటికీ హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయని పేర్కొన్నాయి.