News July 23, 2024
2023లో దాదాపు 4 కోట్ల మంది HIV బాధితులు: యూఎన్ రిపోర్ట్

2023లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 కోట్ల మంది HIV బాధితులు ఉన్నట్లు UN నివేదిక పేర్కొంది. సరైన చికిత్స తీసుకోకపోవడంతో నిమిషానికి ఒకరు ఎయిడ్స్ సంబంధిత సమస్యతో మరణిస్తున్నారని తెలిపింది. మిడిల్ ఈస్ట్, ఉత్తర ఆఫ్రికా, తూర్పు యూరోప్, మధ్య ఆసియా, లాటిన్ అమెరికాలో కొత్త కేసులు పెరుగుతున్నాయంది. ప్రపంచ నేతలంతా 2030 కల్లా ఈ మహమ్మారిని అంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని UNAIDS ఈడీ విన్నీ కోరారు.
Similar News
News November 19, 2025
మానవ రూపంలో గణేషుడ్ని చూశారా?

మనందరికీ ఏనుగు తలతో కూడిన గణపతి మాత్రమే తెలుసు. కానీ ఆయన మానవ రూపంలో ఎలా ఉంటారో చాలామందికి తెలీదు. అయితే వినాయకుడు నరుడిగా దర్శనమిచ్చే ఆలయం తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ ఆది వినాయకుడిగా పూజలందుకునే స్వామివారికి త్రేతా యుగంలో రాములవారు పూజలు నిర్వహించినట్లు స్థల పురాణం చెబుతోంది. అప్పుడు రాముడు సమర్పించిన పిండాలు 4 శివలింగాలుగా మారాయట. వాటినీ ఈ ఆలయంలో చూడవచ్చు. <<-se>>#Temple<<>>
News November 19, 2025
నేటి సామెత.. ‘అదునెరిగి సేద్యం, పదునెరిగి పైరు’

సమయం చూసి వ్యవసాయం చేయాలి. అంటే, వాతావరణ పరిస్థితులు, భూమి స్వభావం, నీటి లభ్యత వంటి అంశాలను పరిశీలించి సాగును ప్రారంభించాలి. భూమికి, వాతావరణానికి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే పంటను వెయ్యాలి. సమయం దాటితే పంట చేతికి రాదు, శ్రమ కూడా వృథా అవుతుంది. అలాగే ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే సమయాన్ని సరిగ్గా అంచనా వేసి, సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పడం ఈ సామెత ఉద్దేశం.
News November 19, 2025
త్వరలో ఆధార్ కార్డులో కీలక మార్పులు!

ఆధార్ విషయంలో కీలక మార్పులు చేయాలని UIDAI భావిస్తోంది. ఫొటో, QR కోడ్తో ఆధార్ కార్డును తీసుకురావడాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వ్యక్తుల డేటా దుర్వినియోగం కాకుండా ఈ దిశగా ఆలోచిస్తోందని తెలిపాయి. కార్డుపై వివరాలు ఎందుకు ఉండాలని, ఫొటో, QR కోడ్ ఉండాలని UIDAI CEO భువనేశ్ కుమార్ అన్నారు. ఆఫ్లైన్ వెరిఫికేషన్ను నియంత్రించేలా డిసెంబర్లో కొత్త రూల్ తీసుకొస్తామని తెలిపారు.


