News February 4, 2025
ఫారినర్స్ను పంపడానికి మంచి ముహూర్తం కావాలా: సుప్రీంకోర్టు ఫైర్
విదేశీయులను పంపించడానికి ఏదైనా మంచి ముహూర్తం కోసం చూస్తున్నారా అంటూ అస్సాం ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇంకెన్నాళ్లు వారిని నిర్బంధ కేంద్రాల్లో ఉంచుతారని అడిగింది. 2 వారాల్లోగా 63 మందిని పంపేయాలని జస్టిస్ అభయ్, ఉజ్జల్ బెంచ్ ఆదేశించింది. ‘వాళ్ల అడ్రసులు తెలియవని పంపించరా? ఆ బాధ మీకెందుకు? వాళ్ల దేశానికి పంపేయండి. ఒకరిని విదేశీయుడిగా గుర్తించాక చర్యలు తీసుకోవాల్సిందే’ అని పేర్కొంది.
Similar News
News February 4, 2025
బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషాపై పోలీసులకు ఫిర్యాదు
హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య మరోసారి నార్సింగ్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ బాషాపై ఆమె ఫిర్యాదు చేశారు. తనను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు ప్రయత్నం చేశారని ఆధారాలతో సహా ఫిర్యాదులో పేర్కొన్నారు. మస్తాన్సాయి, శేఖర్ బాషా కాల్ సంభాషణలను అందజేశారు. పలువురు మహిళల అభ్యంతరకర వీడియోలు కలిగి ఉన్నారని మస్తాన్ సాయిపై నిన్న లావణ్య ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
News February 4, 2025
కులగణన సర్వే నివేదికను ప్రవేశపెట్టిన రేవంత్
TG: కులగణన సర్వే నివేదికను సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. గత ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేశామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే చేశామన్నారు. 50 రోజుల పాటు సర్వే చేశామని పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసమే ఈ సర్వే నిర్వహించామని వెల్లడించారు.
News February 4, 2025
ఇలా చేస్తే క్యాన్సర్ దరిచేరదు!
ఎప్పుడు, ఎలా క్యాన్సర్ సోకుతుందో చెప్పలేం. కానీ, కొన్ని జాగ్రత్తలు ఈ వ్యాధిని దరిచేరనివ్వవు. ఈక్రమంలో వైద్యులు పేర్కొన్న కొన్ని సలహాలు మీకోసం. ధూమపానం చేయొద్దు. హెల్తీ ఫుడ్ తినండి. హెపటైటిస్ బి& HPV నివారణకు టీకాలు వేసుకోవాలి. సన్ ప్రొటెక్షన్ ఉపయోగించండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. మద్యం మానుకోండి. ప్రాసెస్డ్ మాంసం వద్దు. పండ్లు & కూరగాయలు తినండి, పుష్కలంగా నీరు తాగండి, గుడ్లు తినండి.