News November 4, 2024
పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి: సీఎం

TG: ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచినందుకు మంచిర్యాల విద్యార్థులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. స్కిల్ యూనివర్సిటీ, ITIలు ATCలుగా మార్పు, స్పోర్ట్స్ యూనివర్సిటీ గురించి వారికి వివరించారు. రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ప్రకటనలను నమ్మకుండా పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. గంజాయి బారిన పడొద్దన్నారు.
Similar News
News December 5, 2025
NLG: గ్రామాభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి: మంత్రి

నల్గొండ జిల్లా తిప్పర్తి, జొన్నలగడ్డ గూడెం గ్రామాల్లో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఆయన తెలిపారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని విమర్శించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత అభివృద్ధి పనుల కోసం నిధులను అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
News December 5, 2025
CM రేవంత్కు సోనియా అభినందన సందేశం

TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2047 నాటికి రాష్ట్రం $1T ఆర్థికశక్తిగా ఎదగడంలో కీలకం కానుందని INC పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ పేర్కొన్నారు. సమ్మిట్ నిర్వహిస్తున్నందుకు CM రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. సీఎం చేస్తున్న కృషి విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కీలక ప్రాజెక్టులు, ప్రణాళికల్లో భాగమయ్యే వారికి సమ్మిట్ మంచి వేదిక అని తన సందేశంలో పేర్కొన్నారు.
News December 5, 2025
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. సీఎంలకు మంత్రుల ఆహ్వానం

TG: ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2047కు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వ్యాపారవేత్తలతో పాటు పలు రాష్ట్రాల CMలకూ మంత్రులు ఆహ్వానం పలుకుతున్నారు. ఇవాళ AP CM చంద్రబాబును కోమటిరెడ్డి, TN CM స్టాలిన్ను ఉత్తమ్, ఝార్ఖండ్ CM హేమంత్ను భట్టి ఆహ్వానించారు. ‘CBN సీనియర్ నాయకుడు. ఆయన సలహా తీసుకుంటాం. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడాలి’ అని కోమటిరెడ్డి చెప్పారు.


