News August 24, 2024
నీరజ్ ఈటెను 93మీ. విసరగలరు: ఝఝారియా

ఈటెను 90మీ. విసిరేందుకు నీరజ్ చోప్రాకు మరెంతో సమయం పట్టదని పారా అథ్లెట్ ఝఝారియా అన్నారు. ‘జావెలిన్ పరిభాషలో చెప్పాలంటే 89+ అతడికి అడ్డంకిగా మారింది. నా 20 ఏళ్ల కెరీర్లో గమనించింది ఏంటంటే ఎవరూ ఒకటి, అరాతో దాన్ని దాటలేరు. దాటితే 3, 4 మీటర్ల దూరం పెరగడం ఖాయం. రెండేళ్లలో నీరజ్ జావెలిన్‌ను 93మీ. విసరగలడు. ఎందుకంటే అతడికి అంకితభావం, క్రమశిక్షణ ఎక్కువ. అప్పటికి అతడి కెరీర్ పీక్‌లో ఉంటుంది’ అని అన్నారు.
Similar News
News December 1, 2025
కాంగ్రెస్‌కు శశిథరూర్ దూరం అవుతున్నారా?

కాంగ్రెస్‌కు ఆ పార్టీ MP శశిథరూర్‌కు మధ్య విభేదాలు ముదిరినట్లు తెలుస్తోంది. ఇటీవల SIRపై పార్టీ నిర్వహించిన భేటీకి ఆయన గైర్హాజరయ్యారు. అనారోగ్యం వల్లే వెళ్లలేదని చెప్పారు. కానీ తర్వాతి రోజే PM పాల్గొన్న ఓ ప్రోగ్రామ్‌కు వెళ్లారు. తాజాగా పార్లమెంట్ సెషన్స్ ముందు జరిగిన పార్టీ మీటింగ్‌కూ హాజరుకాలేదు. ట్రావెలింగ్‌లో ఉన్నందునే తాను రాలేదని ఆయన చెబుతున్నప్పటికీ INCకి దూరమవుతున్నారనే చర్చ జరుగుతోంది.
News December 1, 2025
సంస్కరణల ప్రభావం.. నవంబర్‌లో తగ్గిన జీఎస్టీ వసూళ్లు

జీఎస్టీ సంస్కరణల ప్రభావం నవంబర్ వసూళ్లపై పడింది. అక్టోబర్‌లో రూ.1.96 లక్షల కోట్లు వసూళ్లవ్వగా నవంబర్‌లో రూ.1.70 లక్షల కోట్లకే పరిమితమైంది. 2024 నవంబర్‌లో రూ.34,141 కోట్లుగా ఉన్న CGST వసూళ్లు ఈ ఏడాది రూ.34,843 కోట్లకు పెరిగాయి. అయితే, SGST వసూళ్లు మాత్రం రూ.43,047 కోట్ల నుంచి రూ.42,522 కోట్లకు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.50,093 కోట్ల నుంచి రూ.46,934 కోట్లకు పడిపోయాయి.
News December 1, 2025
2026లోనే తేలనున్న కృష్ణా జలాల వివాదం!

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదంపై ట్రిబ్యునల్-II తన తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించలేదని కేంద్రమంత్రి రాజ్ భూషణ్ వెల్లడించారు. నిర్ణయాన్ని వెల్లడించేందుకు గడువు పొడిగించాలని ట్రిబ్యునల్ కోరిందన్నారు. దీంతో 2025 AUG 1 నుంచి జులై 31 వరకు గడువు ఇచ్చినట్లు తెలిపారు. ఎంపీ అనిల్ కుమార్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. దీంతో నీటి పంపకాల పంచాయితీకి వచ్చే ఏడాదే ముగింపు దొరకనుంది.


