News August 6, 2024
నీరజ్ గోల్డ్ గెలవాలి.. నహ్తా వీసాలివ్వాలి!

పారిస్ ఒలింపిక్స్లో ఫైనల్స్కు దూసుకెళ్లిన నీరజ్ చోప్రా గెలిచి బంగారు పతకాన్ని సాధించాలని 140 కోట్ల మంది భారతీయులు ఆకాంక్షిస్తున్నారు. అయితే, ఆయన గెలిస్తే ఎంతో మందికి ఉచితంగా ఒక్కరోజు వీసా లభించనుంది. నీరజ్ గోల్డ్ సాధిస్తే ఉచితంగా వీసా అందిస్తామని ‘అట్లిస్’ CEO మొహక్ నహ్తా హామీ ఇచ్చిన విషయాన్ని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. ఫ్రీ వీసా కోసం ఆయన <
Similar News
News October 14, 2025
రాష్ట్రంలో IT అభివృద్ధికి సలహా మండలి

AP: ప్రభుత్వం, స్టార్టప్స్, పారిశ్రామికవేత్తలను సమన్వయం చేసేందుకు IT సలహా మండలిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి లోకేశ్ సహా ఇన్ఫోసిస్, IBM, TCS వంటి సంస్థల హెడ్లు, CII ప్రతినిధులు, ఎక్స్పర్ట్స్, విద్యారంగ, పరిశోధన సంస్థల ప్రతినిధులు వంటి వారికి చోటు కల్పించారు. అవసరం అనుకుంటే సబ్ కమిటీలు/టాస్క్ ఫోర్సులను సైతం ఏర్పాటు చేసుకునేలా వెసులుబాటు కల్పించింది.
News October 14, 2025
పెన్షనర్ల కోసం ‘డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్’ క్యాంపైన్

పెన్షనర్ల కోసం కేంద్రం డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్(DLC) క్యాంపైన్ ప్రారంభించనుంది. నవంబర్ 1-30 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సహా పెన్షనర్లకు నగదు అందించే 19 బ్యాంకులు ఇందులో పాల్గొంటాయి. 1.8 లక్షల పోస్ట్ మ్యాన్/గ్రామీణ డాక్ సేవక్లు ప్రతి పెన్షనర్ ఇంటికి వెళ్లి DLC జెనరేట్ చేస్తారు. సాధారణంగా పెన్షన్ కోసం ఏటా పెన్షనర్లే వెళ్లి లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది.
News October 14, 2025
ఎల్లో అలర్ట్: కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం

TG: రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో కాసేపట్లో HYD, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. గాలి వేగం గంటకు 40 కిలోమీటర్ల కంటే తక్కువగానే ఉంటుందని పేర్కొంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.