News August 18, 2024

నీరజ్ అందుకే ఫౌల్స్ వేశాడు: PCI ప్రెసిడెంట్

image

పారిస్ ఒలింపిక్స్‌ జావెలిన్ త్రో ఫైనల్స్‌లో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా ఫౌల్స్ వేయడంపై పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఝఝారియా స్పందించారు. ‘పాక్ అథ్లెట్ నదీమ్ వేసిన 92.97M త్రోను ఎలాగైనా అధిగమించాలనే ఉద్దేశంతో నీరజ్ ఎక్కువ ఎఫర్ట్ పెట్టారు. అప్పటికే 89Mతో తాను రెండో స్థానంలో ఉండటంతో ఫౌల్స్ గురించి పట్టించుకోలేదు. ఈక్రమంలోనే ఫౌల్స్ అయ్యాయి’ అని ఝఝారియా చెప్పారు.

Similar News

News February 11, 2025

సారీ చెప్పిన హీరో.. అయినా తగ్గమంటున్న వైసీపీ ఫ్యాన్స్!

image

‘లైలా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ వ్యాఖ్యలపై చెలరేగిన <<15417744>>వివాదం<<>> కొనసాగుతోంది. హీరో విశ్వక్‌సేన్ సారీ చెప్పినా వైసీపీ ఫ్యాన్స్ తగ్గటం లేదు. పృథ్వీరాజ్‌తో క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. 115K+ ట్వీట్లతో #BoycottLaila ఇంకా Xలో ట్రెండ్ అవుతోంది. మరి దీనిపై మరోసారి మూవీ టీమ్ నుంచి ఏదైనా ప్రకటన వస్తుందేమో చూడాలి. ఈ సినిమా ఈనెల 14న థియేటర్లలోకి రానుంది.

News February 11, 2025

ఏపీలో అక్షరాస్యత రేటు ఎంతంటే?

image

APలో అక్షరాస్యత రేటు 67.5%గా ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గత మూడేళ్లలో అక్షరాస్యత రేటు పెంపునకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని వైసీపీ ఎంపీ తనూజారాణి అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో కేంద్ర మంత్రి జయంత్ చౌదరి సమాధానం ఇచ్చారు. 2023-24లో దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత 77.5%గా ఉండగా, ఏపీలో 67.5%గా ఉందన్నారు. పీఎం కౌశల్ యోజన కింద రాష్ట్రానికి రూ.48.42కోట్లు మంజూరు చేశామని తెలిపారు.

News February 11, 2025

ఈ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు!

image

TG: రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. సాధారణం కన్నా నాలుగు డిగ్రీలు అధికంగా నమోదవుతాయని పేర్కొంది. మరోవైపు సోమవారం ఖమ్మంలో 35, హైదరాబాద్‌లో 32 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది.

error: Content is protected !!