News June 23, 2024
నీట్ పరీక్షను అందుకే రద్దు చేయలేదు: కేంద్రం

NEET UG-2024 పేపర్ కొన్ని సెంటర్లలో మాత్రమే లీక్ అయినట్లు ఆరోపణలు వస్తున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తెలిపారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పేపర్ లీక్ వల్ల కొందరు లాభపడినప్పటికీ పరీక్షను రద్దు చేస్తే కష్టపడి చదివి రాసిన లక్షలాది మంది నష్టపోతారని పేర్కొన్నారు. 2004, 2015లో లీకేజీ వ్యవహారం భారీ ఎత్తున జరగడంతో పరీక్షను రద్దు చేసినట్లు గుర్తుచేశారు.
Similar News
News October 23, 2025
భారీ వర్షాలు.. ఇవాళ స్కూళ్లకు సెలవు

AP: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావంతో కడప, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, నెల్లూరులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ 5 జిల్లాల్లో ఇవాళ ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు. మరోవైపు ప్రకాశంలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ఆ జిల్లాలోని స్కూళ్లకు సెలవు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
News October 23, 2025
రాజధానిలో 12 బ్యాంకులకు 28న శంకుస్థాపన

AP: అమరావతిలో 12 ప్రముఖ బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు ఈ నెల 28న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పాల్గొననున్నారు. ఉద్దండరాయునిపాలెం వద్ద ప్రభుత్వం స్థలాలు కేటాయించింది. SBI, కెనరా, యూనియన్ బ్యాంక్, BOB, ఇండియన్ బ్యాంక్, ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్, PNB, BOI, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు కానున్నాయి.
News October 23, 2025
నేడు భగినీ హస్త భోజనం

5 రోజుల దీపావళి పండుగలో చివరిది భగినీ హస్త భోజనం. ‘భగిని’ అంటే సోదరి అని అర్థం. ఆమె చేతి భోజనం సోదరుడికి దైవ ప్రసాదంతో సమానం. పురాణాల ప్రకారం.. ఈ పండుగను యమునా దేవి తన సోదరుడు యముడితో కలిసి నిర్వహించింది. అందుకే నేడు అన్నాచెల్లెల్లు/అక్కాతమ్ముళ్లు కలిసి ఆప్యాయంగా కొద్ది సమయం గడుపుతారు. ఇది అకాల మరణం నుంచి తప్పిస్తుందని నమ్ముతారు. ఈ ఆచారం వెనుక బంధాలను బలోపేతం చేసే కారణం కూడా ఉంది.