News June 17, 2024

NEET పేపర్ లీక్ ఆరోపణలు.. సీబీఐ మాజీ జేడీ ఇంట్రెస్టింగ్ ట్వీట్

image

NEET పేపర్ లీక్ అయ్యిందంటూ ఆరోపణలు వస్తున్న వేళ జై భారత్ నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఆటమ్ బాంబులు అవసరం లేదు. నాసిరకం విద్య, విద్యార్థులను పరీక్షల్లో కాపీ కొట్టనివ్వడం లాంటి విధానాలను ప్రోత్సహిస్తే ఆ దేశం దానంతట అదే నాశనం అవుతుంది. అలా చదివిన డాక్టర్స్ చేతిలో రోగులు చనిపోతారు’ అంటూ పలు ఉదాహరణలను ఓ యూనివర్సిటీలో రాశారని పేర్కొన్నారు.

Similar News

News December 1, 2025

గుంటూరులో వ్యభిచార ముఠా అరెస్ట్

image

గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచారంపై టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. గాంధీ పార్క్ వెనుక ఉన్న రామిరెడ్డి నగర్‌లోని ఒక లాడ్జ్‌పై దాడి చేసి, ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలను సహించబోమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు.

News December 1, 2025

CM చంద్రబాబుపై లిక్కర్ కేసు మూసివేత

image

AP: సీఎం చంద్రబాబుపై ఉన్న లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ హయాంలో నమోదైన ఈ కేసు దర్యాప్తును ముగిస్తూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేవని పేర్కొంది. దాని ఆధారంగా ఏసీబీ కోర్టు కేసును మూసేసింది. అలాగే ఆయనపై ఉన్న ఫైబర్‌నెట్ కేసును క్లోజ్ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

News December 1, 2025

₹50వేల కోట్ల దావా.. AERA పక్షాన కేంద్రం!

image

ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల ప్రైవేట్ ఆపరేటర్లు, ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ (AERA) ఆఫ్ ఇండియా మధ్య ₹50వేల కోట్ల దావా SCకు చేరింది. ఇందులో కేంద్రం AERA పక్షాన నిలిచింది. రెగ్యులేటెడ్ సర్వీసెస్ కోసం కాలిక్యులేట్ చేసే అసెట్స్ క్యాపిటల్ వ్యాల్యూపై విభేదాలున్నాయి. ఆపరేటర్లు గెలిస్తే ఢిల్లీ ఎయిర్‌పోర్టులో యూజర్ డెవలప్మెంట్ ఫీజు ₹129 నుంచి ₹1261కి, ముంబైలో ₹175 నుంచి ₹3,856కు పెరుగుతుంది.