News July 3, 2024
ఆగస్టులో నీట్ పీజీ ఎంట్రన్స్ పరీక్ష?

నీట్ పేపర్ లీకేజీ నేపథ్యంలో నీట్-పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్‌ను ఎన్టీఏ రద్దు చేసిన సంగతి తెలిసిందే. వాయిదా పడ్డ ఈ పరీక్షను ఆగస్టులో నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు కేంద్ర హోం శాఖ నిర్వహించిన భేటీలో ఆరోగ్యశాఖ, సైబర్ సెల్, ఇతర అధికారులు, ప్రతినిధులు పరీక్ష సన్నద్ధతపై చర్చించారు. కాగా పరీక్ష ప్రశ్నాపత్రాన్ని ఎగ్జామ్ నిర్వహించే 2గంటల ముందు రూపొందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Similar News
News April 18, 2026
భూములిచ్చే రైతులకు ఎకరాకు ₹40 వేల కౌలు: CBN

AP: రాజధాని రెండో విడత భూ సమీకరణలో భూములిచ్చే రైతులకు ఎకరానికి ₹40 వేల చొప్పున పదేళ్లపాటు కౌలు చెల్లిస్తామని CM చంద్రబాబు తెలిపారు. ఏడాదికి ₹3 వేల చొప్పున కౌలు పెంచుతామని హామీ ఇచ్చారు. కుటుంబానికి ₹1.50 లక్షల మేర వ్యవసాయ రుణమాఫీ చేస్తామని వివరించారు. తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాలకు చెందిన 10 గ్రామాల రైతులతో ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు.
News April 18, 2026
2028లోనే TG అసెంబ్లీ ఎన్నికలు?

పునర్విభజనతో ముడిపడిన మహిళా రిజర్వేషన్ బిల్లు నిన్న LSలో వీగిపోవడంతో కేంద్రం 2029లో చేపట్టాలనుకున్న జమిలి ఎన్నికలూ అసాధ్యమేనని రాజకీయ వర్గాలంటున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి, తర్వాత జమిలికి వెళ్లాలని మోదీ ప్రభుత్వం భావించిందని చెబుతున్నారు. కానీ డీలిమిటేషన్ కుదరకపోవడంతో దీనికి వెళ్లకపోవచ్చని అంటున్నారు. అలా అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు యథాతథంగా 2028లోనే జరగనున్నాయి.
News April 18, 2026
నేడు 2 మ్యాచులు.. SRHపై ధోనీ ఆడతారా?

IPLలో ఇవాళ డబుల్ ధమాకా ఉండనుంది. 3.30PMకు ఢిల్లీ, బెంగళూరు తలపడనున్నాయి. ఆడిన 5 మ్యాచుల్లో 4 గెలిచి RCB జోరు మీద ఉండగా, చివరి 2 మ్యాచుల్లో ఓడి DC కష్టాల్లో ఉంది. మరోవైపు 7.30PMకు SRH, CSK మధ్య కీలక పోరు జరగనుంది. ఈ సీజన్లో ఇరుజట్లూ చెరో 2 గెలిచి, 3 ఓడాయి. అయితే వరుసగా 2 మ్యాచుల్లో గెలవడం, ధోనీ ఆడే అవకాశం ఉండటం చెన్నైకి కలిసొచ్చే అంశం. మరోవైపు SRH బ్యాటింగ్‌లో అదరగొడుతున్నా బౌలింగ్‌లో తేలిపోతోంది.


