News August 7, 2024

నీట్ పీజీ పేపర్ కూడా లీక్ అయిందా?

image

ఇప్పటికే నీట్-యూజీ అవకతవకలపై దేశవ్యాప్త చర్చ నడుస్తుండగా, తాజాగా నీట్-పీజీ పేపర్ కూడా లీక్ అయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 11న జరిగే పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను టెలిగ్రామ్‌లో ‘నీట్ పీజీ లీక్డ్ మెటీరియల్స్’ పేరిట ఉన్న గ్రూపుల్లో విక్రయిస్తున్నారని ధ్రువ్ చౌహాన్ అనే నెటిజన్ ఆరోపించారు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ షేర్ చేశారు. దీంతో అభ్యర్థుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.

Similar News

News January 22, 2025

రెండో రోజు ఐటీ రైడ్స్

image

హైదరాబాద్‌లోని చిత్ర నిర్మాణ సంస్థలపై రెండో రోజు ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. SVC నిర్మాణ సంస్థ యజమానులు దిల్ రాజు, శిరీష్, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన పుష్ప-2, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల కలెక్షన్ల నేపథ్యంలో తనిఖీలు జరుగుతున్నాయి. ప్రకటించిన కలెక్షన్లకు కడుతున్న ఆదాయ పన్నుకు మధ్య తేడాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

News January 22, 2025

వైస్ ప్రెసిడెంట్‌గా ఉషను ఎంపిక చేయాల్సింది: ట్రంప్

image

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన సందర్భంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య, భారత సంతతి మహిళ ఉషపై ప్రశంసలు కురిపించారు. ఆమె చాలా తెలివైందని, ఉపాధ్యక్ష పదవికి ఉషనే ఎంపిక చేయాల్సింది కానీ వారసత్వం సరికాదు కాబట్టి జేడీని తీసుకున్నా’ అని వ్యాఖ్యానించారు. ఇక జేడీ గొప్ప సెనెటర్ అని, అందుకే ఆయనకు ఓహియో బాధ్యతలు అప్పగించినట్లు ట్రంప్ తెలిపారు.

News January 22, 2025

స్కూళ్లకు గుడ్‌న్యూస్

image

APలోని స్కూళ్లల్లో రూ.1450 కోట్లతో కంప్యూటర్ ల్యాబ్‌లు, గ్రౌండ్స్ అభివృద్ధి చేస్తామని గురుకుల స్కూళ్ల కార్యదర్శి మస్తానయ్య తెలిపారు. 2026 నాటికి 855 స్కూళ్లలో ఆధునిక వసతులు కల్పిస్తామన్నారు. చిత్తూరు జిల్లా కలికిరి, పీలేరు గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. గురుకులాల పరిధిలో 50 స్కూళ్లు, 10 జూనియర్, ఒక డిగ్రీ కాలేజీ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.