News August 8, 2024
నీట్-పీజీ ప్రశ్నాపత్రం లీకు తప్పుడు ప్రచారమే: NBEMS

నీట్-పీజీ ప్రశ్నాపత్రం లీకైందంటూ కొందరు చేస్తున్న <<13798948>>ప్రచారాన్ని<<>> నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆన్ మెడికల్ సైన్సెస్(NBEMS) కొట్టిపారేసింది. టెలిగ్రామ్ ఛానల్లో ప్రచారంలో ఉన్న తప్పుడు న్యూస్ను చూసి అభ్యర్థులు మోసపోవద్దని సూచించింది. ఇప్పటి వరకూ నీట్-పీజీ 2024 ప్రశ్నాపత్రం రూపొందించలేదని తెలిపింది. లీకు అంటూ జరుగుతున్న ప్రచారం ఫేక్ అని స్పష్టం చేసింది.
Similar News
News November 17, 2025
షేక్ హసీనాకు మరణశిక్ష

బంగ్లాదేశ్లోని ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ (ICT) సంచలన తీర్పు ఇచ్చింది. ఢాకా అల్లర్ల కేసులో ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది. గతేడాది విద్యార్థుల ఆందోళనల సమయంలో 1400 మంది చావుకు కారణమయ్యారని ఆమెతో పాటు మరో ఇద్దరిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఆమెను దోషిగా తేల్చిన కోర్టు తాజాగా మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ప్రస్తుతం హసీనా భారత్లో తల దాచుకుంటున్నారు.

1,260 ఉద్యోగాలు.. సెలక్షన్ లిస్ట్ విడుదల

TG: 1,260 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల లిస్టును మెడికల్&హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు 24,045 మంది దరఖాస్తు చేయగా, 23,323 మంది పరీక్ష రాశారు. కాగా స్పోర్ట్స్ కోటా సెలక్షన్ లిస్టును సెపరేట్గా రిలీజ్ చేస్తామని MHSRB వెల్లడించింది. వికలాంగుల కోటాలో దరఖాస్తుదారులు లేకపోవడంతో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది.
ఫలితాల కోసం <