News July 29, 2024
2-3 రోజుల్లో నీట్ రాష్ట్రస్థాయి ర్యాంకులు

TG: రివైజ్డ్ నీట్ ఫలితాలను NTA విడుదల చేసిన నేపథ్యంలో 2-3 రోజుల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు విడుదల కానున్నాయి. తాజా ఫలితాల్లో చాలామంది ర్యాంకులు మారడంతో DGHS రాష్ట్రాల వారీగా అభ్యర్థుల ర్యాంకుల జాబితాను సిద్ధం చేస్తోంది. తొలుత MBBS, BDS సీట్ల కోసం ఆలిండియా ర్యాంక్ ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. ఆ తర్వాత ర్యాంకులు విడుదల చేస్తారు. అనంతరం హెల్త్ యూనివర్సిటీ కౌన్సెలింగ్ ప్రారంభించనుంది.
Similar News
News November 13, 2025
పిల్లలు మొండిగా ఉంటున్నారా?

పిల్లలు మొండిగా మారకూడదన్నా, వాళ్లలో అప్పటికే ఉన్న ఈ ప్రవర్తనను మార్చుకోవాలన్నా పేరెంట్స్ పిల్లలతో మెలిగే విధానం పైనే ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. పిల్లల్ని తిట్టో, కొట్టో మార్చుకోవచ్చనుకుంటారు చాలామంది. దీనివల్ల వాళ్లు మరింత మొండిగా తయారవుతారు. కాబట్టి ఓపికగా వారికి వివరించాలి. పొగడటం, ప్రోత్సహించడం వల్ల పిల్లల్లో మొండితనం తగ్గుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు వారికి సమయం కేటాయించాలి.
News November 13, 2025
నేడు దానధర్మాలు చేస్తే..?

గురువారం చాలామంది సాయిబాబాను పూజిస్తారు. అయితే ఆయన పూజతో పాటు నేడు దానధర్మాలు చేయడం ఎంతో శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు. పేదలకు ఆహారం, వస్త్రాలు దానం చేస్తే ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుందంటున్నారు. దానాలు చేస్తే సంపద పెరుగుతుందని హిందూ ధర్మ శాస్త్రం చెబుతోంది. ఇలా 9 వారాలు చేసి, సాయిబాబా ఆలయాన్ని దర్శించుకుంటే వృత్తి-వ్యాపారాలలో పురోగతి ఉంటుందని, కుటుంబంలో శాంతి లభిస్తుందని నమ్మకం.
News November 13, 2025
‘పీక్ కోల్డ్‌వేవ్’: తెలంగాణపై చలి పంజా!

రాష్ట్రంలో చలి తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. ఈరోజు నుంచి ‘పీక్ కోల్డ్‌వేవ్’ పరిస్థితులు ప్రారంభం కానున్నాయి. రాత్రి, ఉదయం వేళల్లో ఉష్ణోగ్రతలు 10°C-8°C వరకు పడిపోయే అవకాశం ఉంది. ఈనెల 18 వరకు ఇది కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లోనూ టెంపరేచర్ 13°C-11°Cకి పడిపోతుందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా వెచ్చని దుస్తులు ధరించాలని హెచ్చరిస్తున్నారు.


