News July 23, 2024
నీట్-యూజీ: 4 మార్కులు కోల్పోయిన 4.2 లక్షల మంది అభ్యర్థులు

నీట్-యూజీ పరీక్ష రాసిన 24 లక్షల మంది అభ్యర్థుల్లో 4.2 లక్షల మంది 4 మార్కులు కోల్పోయారు. ఫిజిక్స్‌లోని ఓ ప్రశ్నకు రెండు ఆప్షన్లు సరైనవిగా పేర్కొనడాన్ని వ్యతిరేకిస్తూ ఓ అభ్యర్థి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో చాలామందికి 4 మార్కులు(ఓ ప్రశ్నకు) అదనంగా కలిశాయని, ఇది మెరిట్ లిస్టుపై ప్రభావం చూపిందని తెలిపారు. దీనిపై IIT ఢిల్లీ సూచనలతో ఆప్షన్ 4 ఎంచుకున్న వారికే మార్కులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
Similar News
News December 10, 2025
గాయపడిన సింహం.. తిరిగొచ్చి అదరగొట్టింది!

‘గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జనకన్నా భయంకరంగా ఉంటుంది’ అనే డైలాగ్ హార్దిక్ పాండ్యకు సరిగ్గా సరిపోతుంది. గాయం నుంచి కోలుకుని SAతో తొలి T20లో రీఎంట్రీ ఇచ్చిన అతడు 28 బంతుల్లో 59* రన్స్ చేశారు. ఓవైపు ఇతర బ్యాటర్లు వికెట్ కాపాడుకునేందుకే అవస్థలు పడుతుంటే పాండ్య మాత్రం కామ్&కంపోజ్డ్ షాట్లతో విరుచుకుపడ్డారు. బౌలింగ్‌లోనూ తొలి బంతికే వికెట్ తీశారు. ఇరు జట్లలో వేరే ఏ ఆటగాడు 30+ స్కోర్ చేయలేదు.
News December 10, 2025
తిరుమల శ్రీవారి చెంత బయటపడ్డ మరో స్కాం

కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వరుడిని మోసం చేసిన మరో స్కాం బయటకొచ్చింది. వేద ఆశీర్వచనం పొందే ప్రముఖులకు ఇచ్చే పట్టువస్త్రాల (సారిగ దుపట్టా) కొనుగోలులో భారీ మోసం, అక్రమాలు జరిగినట్లు TTD విజిలెన్స్ గుర్తించింది. నగరికి చెందిన VRS ఎక్స్‌పోర్ట్స్ ₹100 విలువ చేయని పాలిస్టర్ క్లాత్‌ను పట్టు అని ₹1400కు సరఫరా చేసినట్లు బోర్డుకు తెలిపింది. 2015-25 మధ్య ఇలా శ్రీవారి ఖజానా నుంచి ₹54 కోట్లు దోచుకుంది.
News December 10, 2025
రేపటి నుంచి భవానీ దీక్షల విరమణ

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ప్రారంభంకానున్న భవానీ మండల దీక్ష విరమణకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ నెల 15 వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమానికి 7 లక్షల మంది భవానీలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గిరి ప్రదక్షిణ కోసం 9 కి.మీ. మార్గాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేశారు. భవానీల కోసం 3 హోమగుండాలు, నిత్య అన్నదానం, రైల్వే స్టేషన్- బస్ స్టాండ్‌ల నుంచి బస్సులు ఏర్పాటు చేశారు.


