News July 11, 2024
నీట్ యూజీ కేసు విచారణ వాయిదా

నీట్ యూజీ పేపర్ లీక్ కేసు విచారణను సుప్రీంకోర్టు ఈనెల 18కి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించిన పలువురికి కేంద్రం, NTA అందించిన అఫిడవిట్లు అందకపోవడం, వారికి కొంత గడువు అవసరం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ప్రశ్నపత్రం లీకేజీ విస్తృత స్థాయిలో జరగలేదని సీబీఐ కోర్టుకు సమర్పించిన నివేదికలో తెలియజేసింది. మరోవైపు నీట్ పరీక్షలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదని NTA పేర్కొంటోంది.
Similar News
News October 30, 2025
తుఫాన్ ఎఫెక్ట్.. వేడి చేసిన నీటినే తాగండి

తెలుగు రాష్ట్రాల్లో ‘మొంథా’ తుఫాన్ బీభత్సం సృష్టించింది. దీంతో వర్షాలు, వరద ప్రభావిత ప్రాంత ప్రజలు వేడి చేసిన నీటినే తాగాలని అధికారులు సూచించారు. తద్వారా వ్యాధుల ముప్పు నుంచి బయటపడొచ్చని చెప్పారు. ఈ సమయంలో జ్వరం బారిన పడితే నిర్లక్ష్యం వహించకుండా వైద్యులను సంప్రదించాలని తెలిపారు. మరోవైపు కొన్ని చోట్ల అధికారులు పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు వాపోతున్నారు.
News October 30, 2025
న్యూక్లియర్ వెపన్ టెస్టింగ్ ప్రారంభించండి: ట్రంప్

US తక్షణమే న్యూక్లియర్ వెపన్ టెస్టింగ్ ప్రారంభిస్తుందని ప్రెసిడెంట్ ట్రంప్ పేర్కొన్నారు. తాను డిపార్ట్మెంట్ ఆఫ్ వార్కు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ఇతర అణుశక్తి దేశాల చర్యలకు సమాధానంగా తామీ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ‘న్యూక్లియర్ వెపన్స్లో అగ్రస్థానంలో అమెరికా ఉంది. తర్వాత రష్యా, చైనా ఉన్నాయి. కానీ ఐదేళ్లలో పరిస్థితి మారొచ్చు. నాకిది ఇష్టం లేకపోయినా తప్పట్లేదు’ అని తెలిపారు.
News October 30, 2025
ఇంట్లో ఈ మొక్కలుంటే దోమలు పరార్

దోమల వల్ల వచ్చే వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి మార్కెట్లో దొరికే కాయిల్స్, క్రీమ్స్, మస్కిటో మ్యాట్ ప్రొడక్ట్స్ వాడతాం. వీటి ప్రభావం మనపై కూడా పడుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే ఇంట్లో కొన్ని మొక్కలు పెంచుకోవాలంటున్నారు నిపుణులు. బంతి, తులసి, లావెండర్, రోజ్మేరీ, కలబంద మొక్కలు దోమలను తరిమేయడంలో సహకరిస్తాయి. అలాగే ఇంటి బయట వేప, యూకలిప్టస్ చెట్లను పెంచినా దోమల బెడద తగ్గుతుందంటున్నారు నిపుణులు.


