News February 7, 2025
నీట్- UG పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

నీట్- యూజీ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి మార్చి 7 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ప్రకటించింది. మే 4న పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. దేశ వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో సీట్ల భర్తీకి NTA ఈ పరీక్ష నిర్వహించనుంది.
Similar News
News March 21, 2026
ఇరాన్‌పై దాడులకు US సాయం కోరిందా? భారత్ స్పందనిదే..

ఇరాన్‌పై బాంబు దాడి చేసేందుకు భారత మిలిటరీ స్థావరాలను వాడుకునేందుకు అమెరికా అనుమతి కోరిందన్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. ఇందులో నిజం లేదని, ఇలాంటి వార్తలను నమ్మవద్దని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కాగా ఇరు దేశాల మధ్య ఉన్న లాజిస్టిక్స్ ఎక్స్ఛేంజ్ మెమొరాండం ఆఫ్ అగ్రిమెంట్(LEMOA) ప్రకారం భారత్ దీనికి అనుమతి ఇవ్వొచ్చని ఓ జర్నలిస్ట్ చేసిన పోస్టుకు MEA ఈ విధంగా స్పందించింది.
News March 21, 2026
త్వరలో ప్రధాని మోదీ తెలంగాణ టూర్!

ప్రధాని మోదీ రానున్న రోజుల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. బీబీనగర్ ఎయిమ్స్ ప్రారంభోత్సవం సహా మరికొన్ని అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. త్వరలో GHMC ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మోదీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ రెండో వారంలో ప్రధాని టూర్ ఉండనున్నట్లు తెలుస్తోంది.
News March 21, 2026
10 రోజుల్లో రూ.13,320 తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత 10 రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.13,320 తగ్గింది. అటు 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.12,160 తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,900, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,36,540 పలుకుతోంది.


