News July 11, 2024
నీట్ యూజీ పేపర్ లీక్ వీడియో ఫేక్: NTA

మే 4నే నీట్ UG పేపర్ లీక్ అయినట్లు టెలిగ్రామ్‌లో సర్క్యూలేట్ అయిన వీడియో ఫేక్ అని NTA సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తెలియజేసింది. పేపర్ పరీక్షకు ముందే లీక్ అయిందని నమ్మించడానికి తేదీలను, సమయాన్ని ఎడిట్ చేశారని తెలిపింది. మరోవైపు పట్నాలో కమాండ్ సెంటర్ నుంచి పేపర్ లీకైనట్లు CC ఫుటేజ్‌లో ఎలాంటి ఆధారాలు లేవంది. పెట్టెల్లో పేపర్లు సేఫ్‌గానే ఉన్నాయని, తాళం పగలగొట్టిన దాఖలాలు లేవని తెలిపింది.
Similar News
News November 9, 2025
అనుపమ ఫొటోలు మార్ఫింగ్.. చేసింది ఎవరో తెలిసి షాకైన హీరోయిన్

తన ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పోలీసులను ఆశ్రయించారు. విచారణలో తమిళనాడుకు చెందిన 21 ఏళ్ల అమ్మాయే ఆ పని చేస్తున్నట్లు తెలిసి షాక్ అయినట్లు ఆమె తెలిపారు. ఇన్‌స్టాలో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి మార్ఫ్డ్ ఫొటోలు, అసభ్యకర కంటెంట్‌తో తన ఇమేజ్ను దెబ్బతీసిందన్నారు. సదరు అమ్మాయిపై లీగల్ చర్యలకు సిద్ధమైనట్లు అనుపమ చెప్పారు.
News November 9, 2025
ఈ వైరస్‌తో బెండ పంటకు తీవ్ర నష్టం

బెండ పంటను ఆశించే చీడపీడల్లో ‘ఎల్లో వీన్ మొజాయిక్ వైరస్’ ప్రధానమైనది. ఈ వైరస్ ఉద్ధృతి పెరిగితే పంట పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. మొజాయిక్ వైరస్ సోకిన మొక్కల ఆకులపై పసుపుపచ్చని మచ్చలు లేదా చారలు ఏర్పడతాయి. ఆకుల ఆకారం మారుతుంది. కాండంపై మచ్చలు కనిపిస్తాయి. మొక్కల ఎదుగుదల, కాయల నాణ్యత తగ్గుతుంది. ఈ వైరస్ ఒక మెుక్క నుంచి ఇతర మొక్కలకు వ్యాపిస్తుంది.
News November 9, 2025
ఏపీ న్యూస్ అప్డేట్స్

* ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద పెరిగింది. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీకి అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
* తాడిపత్రిలో బాలిక యశస్వి భారతి(9) 6ని.ల 9సెకన్లలో 100 ట్యూబ్లైట్లను తలపై పగలగొట్టించుకుంది. వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం కోసం ఈ సాహసం చేసింది.
* ఒకప్పుడు గిరిజన గ్రామాలంటే డోలీ మోతలని, ఇప్పుడు పర్యాటక కేంద్రాలుగా మారాయని మంత్రి సంధ్యారాణి చెప్పారు.


