News June 4, 2024

NEET UG ఫలితాలు రిలీజ్.. 89 మందికి 720/720

image

దేశవ్యాప్తంగా వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే NEET యూజీ-2024 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థి అప్లికేషన్ నంబర్, DOBతో ఫలితాలు తెలుసుకోవచ్చు. MBBS, BDS, BSMS, BUMS BHMS కోర్సుల ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తుంటారు. ఈసారి 89 మందికి 720/720 మార్కులు వచ్చాయి. దీంతో లాటరీ విధానం ద్వారా AIIMS ఢిల్లీలో సీటు ఎవరికి వస్తుందో నిర్ణయిస్తారు. గతేడాది ఇద్దరికి మాత్రమే 720 మార్క్స్ వచ్చాయి.

Similar News

News November 30, 2024

కోహ్లీ.. ఆ రికార్డు బ్రేక్ చేస్తాడా?

image

BGT రెండో టెస్టు జరిగే అడిలైడ్ ఓవల్ గ్రౌండ్‌లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డుకు చేరువయ్యారు. ఈ మైదానంలో మరో 102 పరుగులు చేస్తే ఆయన లారా అత్యధిక పరుగుల రికార్డును అధిగమించనున్నారు. ఇప్పటివరకు కోహ్లీ ఈ గ్రౌండ్‌లో 509 పరుగులు చేశారు. 611 పరుగులతో లారా, 552 పరుగులతో వివి రిచర్డ్స్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఈ వేదికలో కోహ్లీ సగటు 60కి పైనే ఉంది. డిసెంబర్ 6 నుంచి రెండో టెస్టు జరగనుంది.

News November 30, 2024

పదేళ్లలో 102% పెరిగిన మెడికల్ కాలేజీలు: నడ్డా

image

దేశంలో డాక్టర్-జనాభా నిష్పత్తి WHO ప్రమాణం కన్నా మెరుగ్గా ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. WHO ప్రకారం 1:1000గా ఉండగా దేశంలో ప్రతి 811 మందికి ఒక వైద్యుడు ఉన్నారని తెలిపారు. ఈ నెల వరకు మొత్తం 13,86,145 మంది వైద్యులు రాష్ట్ర, జాతీయ మెడికల్ కౌన్సిల్ వద్ద రిజిస్టర్ చేసుకున్నట్లు చెప్పారు. 2014లో 387 ప్రభుత్వం కాలేజీలు ఉంటే ఇప్పుడు 102% పెరిగి ఆ సంఖ్య 780గా ఉందన్నారు.

News November 30, 2024

క్రికెటర్లెందుకు చూయింగ్ గమ్ నములుతారు?

image

క్రికెటర్లు ఆడుతున్నప్పుడు చూయింగ్ గమ్ నములుతూ కనిపిస్తుంటారు. అది కేవలం టైమ్ పాస్ కోసం కాదు. బ్యాటింగ్ లేదా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఓ గంట గడిచేసరికి శరీరం దానికి అలవాటు పడి రిలాక్స్ అయిపోతుందని క్రీడా నిపుణులు చెబుతున్నారు. చూయింగ్ గమ్ నములుతున్నప్పుడు మెదడు చురుకుగా ఉంటుందని, నిర్ణయాల్ని వేగంగా తీసుకోగలరని పేర్కొంటున్నారు. అదే విధంగా ఒత్తిడిని తగ్గించేందుకూ ఉపకరిస్తుందని వివరిస్తున్నారు.