News July 26, 2024

నీట్ యూజీ(రివైజ్డ్) ఫలితాలు విడుదల

image

నీట్ యూజీ(రివైజ్డ్) ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి. మే 5న జరిగిన పరీక్షల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో గ్రేస్ మార్కులు కలిపిన 1563 మందికి జూన్ 23న మళ్లీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.

Similar News

News December 18, 2025

శ్రీ సత్యసాయి జిల్లా ఇంఛార్జ్‌గా గ్రంధం చంద్రుడు

image

అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు జిల్లా ఇంఛార్జ్‌లుగా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించింది. ఈ మేరకు CS విజయానంద్ గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా సత్యసాయి జిల్లా ఇంఛార్జ్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి గంధం చంద్రుడును నియమించింది. గతంలో గంధం చంద్రుడు ఉమ్మడి అనంతపురం జిల్లా కలెక్టర్‌గా పని చేశారు.

News December 18, 2025

రోల్ బాల్ WC విజేతలుగా భారత జట్లు

image

దుబాయ్ వేదికగా జరిగిన రోల్ బాల్ వరల్డ్ కప్‌లో భారత మెన్స్, ఉమెన్స్ టీమ్స్ అదరగొట్టి ఛాంపియన్లుగా నిలిచాయి. కెన్యా జట్లతో జరిగిన ఫైనల్‌లో మహిళల జట్టు 3-2 తేడాతో, పురుషుల జట్టు 11-10 తేడాతో విజయం సాధించాయి. కాగా ఇది రోలర్ స్కేట్స్‌తో ఆడే ఒక గేమ్. బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, త్రోబాల్ కలయికలో ఉంటుంది. ఆటగాళ్లు స్కేట్స్ వేసుకొని బంతిని చేతులతో పాస్ చేసుకుంటూ ప్రత్యర్థి గోల్ పోస్ట్‌లోకి వేయాలి.

News December 18, 2025

విడాకులు తీసుకున్నట్లు నటుడి ప్రకటన

image

17 ఏళ్ల వివాహ బంధానికి సీనియర్ నటుడు షిజు ఏఆర్ ముగింపు పలికారు. ‘ప్రీతికి, నాకు పరస్పర అంగీకారంతో విడాకులు మంజూరయ్యాయి. ఇకపై ఇద్దరం స్నేహితులుగా ఉంటాం. మా ప్రైవసీకి భంగం కల్గించొద్దని కోరుతున్నా’ అని సోషల్ మీడియాలో తెలిపారు. మాలీవుడ్ పాపులర్ నటుల్లో ఒకరైన షిజు తెలుగులో ‘దేవి’తో పరిచయమై ‘సింహరాశి, మనసంతా నువ్వే, గౌతమ్ SSC, నువ్వు నాకు నచ్చావ్, శతమానం భవతి, రాబిన్ హుడ్’ తదితర సినిమాల్లో నటించారు.