News March 18, 2024
NEET UG: నేటి నుంచి దరఖాస్తుల సవరణ

NEET UG-2024 దరఖాస్తులను సవరించుకునేందుకు NTA అవకాశం కల్పించింది. నేటి నుంచి ఈనెల 20న రాత్రి 11:50 గంటల వరకు అభ్యర్థులు తమ అప్లికేషన్స్లో కరెక్షన్స్ చేసుకోవచ్చని తెలిపింది. ఇదే చివరి అవకాశమని, ఆ తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఈ పరీక్షను మే 5న ఆఫ్లైన్ పద్ధతిలో నిర్వహించనున్నారు. ఈనెల 8తో నీట్ రిజిస్ట్రేషన్ గడువు ముగిసిన సంగతి తెలిసిందే.
Similar News
News October 20, 2025
దీపావళి శుభాకాంక్షలు చెప్పిన పాక్ PM.. నెటిజన్ల ఫైర్

ప్రపంచంలోని హిందువులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పాక్ PM షరీఫ్ ట్వీట్ చేశారు. ఈ పండుగ చీకటిని పారదోలి, సామరస్యాన్ని పెంపొందించి, శాంతి, కరుణ, శ్రేయస్సు వైపు మనల్ని నడిపించాలని పేర్కొన్నారు. కాగా పహల్గాంలో హిందువులను చంపి ఇప్పుడు విషెస్ చెబుతారా అంటూ భారత నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పాక్లో హిందువులు, సిక్కులను ఒక పద్ధతి ప్రకారం చంపారని మండిపడుతున్నారు.
News October 20, 2025
మీకు తెలుసా? దేవతల పుత్రుడే ‘నరకాసురుడు’

కృష్ణుడు, సత్యభామ కలిసి నరకాసురుడ్ని చంపి, వెలుగు నింపినందుకు గుర్తుగా మనం దీపావళి జరుపుకుంటాం. అయితే ఆ నరకాసురుడు దేవతల పుత్రుడే అని మీకు తెలుసా? విష్ణుమూర్తి వరాహ అవతారానికి, భూదేవికి జన్మించిన కుమారుడే ఈ అసురుడు. ప్రాగ్జ్యోతిషపురాన్ని పాలించిన ఇతను దుష్ట స్వభావాన్ని పెంచుకుని అసురుడిగా మారాడు. అహంకారం పెరిగి 16K రాజకుమార్తెలను బంధించాడు. తన తల్లి చేతిలో తప్ప మరెవరి చేత మరణం లేని వరం ఉండేది.
News October 20, 2025
ఇవాళ బిడ్డల ఇళ్లకు పితృదేవతలు!

దీపావళి నాడు సాయంత్రం పితృదేవతలు ఆకాశంలో దక్షిణ దిక్కుగా వచ్చి తమ సంతానాల గృహాలను సందర్శిస్తారని నమ్మకం. వారికి దారి కనిపించటం కోసమే పిల్లల చేత దివ్వెలు కొట్టే సంప్రదాయం ఏర్పడింది. వీధి గుమ్మం ముందు దివిటీలను వెలిగించి గుండ్రంగా మూడుసార్లు తిప్పి నేలకు కొట్టిస్తూ ‘దుబ్బు దుబ్బు దీపావళి, మళ్లీ వచ్చే నాగుల చవితి’ అని పలికిస్తారు.
* మరిన్ని దీపావళి విశేషాల కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీకి వెళ్లండి.