News July 27, 2024
‘యానిమల్’పై నెగటివ్ కామెంట్స్.. రణ్‌బీర్ ఏమన్నారంటే?

‘యానిమల్’ సినిమా కొందరికి తప్పుగా అర్థమైందని రణ్‌బీర్ కపూర్ అన్నారు. ‘ఇండస్ట్రీ వాళ్లే చాలా మంది నేను ఇలాంటి సినిమాలో నటించడం తమకు నచ్చలేదని చెప్పారు. ఇంకోసారి ఇలాంటి మూవీ చేయనని చెప్పి క్షమాపణలు కోరాను. వారి అభిప్రాయాలతో ఏకీభవించను. కానీ గొడవలు పెట్టుకోవడం నాకిష్టం లేదు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ మూవీలో హింసను ఎక్కువగా, స్త్రీని తక్కువ చేసి చూపించారని విమర్శలొచ్చిన సంగతి తెలిసిందే.
Similar News
News January 18, 2026
ట్రంప్ వద్దకు నోబెల్ శాంతి.. స్పందించిన కమిటీ

ట్రంప్‌నకు వెనిజులాకు చెందిన మచాడో తన <<18868941>>శాంతి<<>> బహుమతిని ఇవ్వడంపై భిన్నమైన స్పందన రాగా తాజాగా నోబెల్ కమిటీ స్పందించింది. మెడల్ ఎవరి వద్ద ఉన్నా తాము ప్రకటించిన విజేతలో మార్పు ఉండదని తెలిపింది. విజేతలు తీసుకునే నిర్ణయాలపై అవార్డు కమిటీ ఎలాంటి కామెంట్లు చేయబోదని పేర్కొంది. మెడల్‌ను అమ్మడం, దానం చేయడం వంటి వాటిపై పరిమితులు లేవని తెలిపింది. గతంలోనూ పలువురు మెడల్స్‌ను డొనేట్/అమ్మడం చేసినట్లు వెల్లడించింది.
News January 18, 2026
ప్చ్.. రో‘హిట్’ అవ్వలేదు

న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ నిరాశపర్చారు. మూడో వన్డేలో 11 పరుగులే చేసి ఫౌల్క్స్ బౌలింగ్‌లో వెనుదిరిగారు. సిరీస్ మొత్తంగా 61 పరుగులే చేశారు. మరో ఆరు నెలల వరకు వన్డే మ్యాచ్‌లు లేవు. హిట్ మ్యాన్ నుంచి ఆశించిన స్థాయిలో ప్రదర్శన లేకపోవడం ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తోంది. మళ్లీ IPL-2026లోనే రోహిత్ ఆటను చూడవచ్చు. ప్రస్తుతం వన్డేల్లో రోహిత్ 3వ ర్యాంకులో కొనసాగుతున్నారు.
News January 18, 2026
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. ఆరుగురు మావోలు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. నేషనల్ పార్కు ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో నిన్న నలుగురు, ఇవాళ ఇద్దరు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. ఘటనాస్థలంలో AK-47 సహా 6 తుపాకులు, పేలుడు పదార్థాలను భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి.


