News February 2, 2025
RC16లో ఓ సీక్వెన్స్కు నెగటివ్ రీల్: రత్నవేలు

బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్, జాన్వీ జంటగా నటిస్తున్న RC16 మూవీపై సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఆసక్తికర విషయం వెల్లడించారు. ఇందులో ఓ సీక్వెన్స్లో సహజత్వం కోసం నెగటివ్ రీల్ ఉపయోగించనున్నట్లు తెలిపారు. కొన్నేళ్లుగా అంతా డిజిటల్ అయిందని, అయితే హాలీవుడ్లో నెగటివ్ వాడుతున్నారని చెప్పారు. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారమన్నారు. గ్రామీణ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.
Similar News
News December 8, 2025
గ్లోబల్ సమ్మిట్ PHOTO GALLERY

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తొలిరోజు ముగిసింది. ఇవాళ రూ.1.88లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. CM రేవంత్ అన్నీ తానై పర్యవేక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు. తొలిరోజు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోలను పైన చూడవచ్చు.
News December 8, 2025
హనుమాన్ చాలీసా భావం – 32

రామ రసాయన తుమ్హరే పాసా|
సదా రహో రఘుపతి కే దాసా||
ఓ ఆంజనేయా! నీ దగ్గర రామ నామం అనే శక్తిమంతమైన అమృతం ఉంది. ఈ శక్తి నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. అందుకే నువ్వు ఎల్లప్పుడూ రఘుపతికి నమ్మకమైన, గొప్ప దాసుడివిగా ఉండగలుగుతున్నావు. శ్రీరాముడిపై నీకున్న అనంతమైన భక్తికి, ఆ రామనామమే మూలం. ఆ రామనామ శక్తితోనే నీకు అన్నీ సాధ్యమయ్యాయి. ఆ శక్తులతోనే మమ్ము కాపాడు తండ్రీ! <<-se>>#HANUMANCHALISA<<>>
News December 8, 2025
చలి పంజా.. బయటికి రావద్దు!

TG: రాష్ట్రవ్యాప్తంగా చలి పంజా విసురుతోంది. వచ్చే 2-3 రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు, ఎల్లుండి ADB, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, MDK, కామారెడ్డి జిల్లాల్లో శీతల గాలులు వీస్తాయంటూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉదయం, రాత్రి వేళల్లో అవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించింది.


