News September 12, 2024
నెగ్గిన ఏచూరి ప్రతిపాదన.. రాజ్యసభలో అరుదైన ఘటన

తనదైన శైలిలో సమస్యల్ని పార్లమెంట్‌లో ప్రస్తావించడంలో <<14084560>>సీతారాం ఏచూరి<<>> దిట్ట. సబ్జెక్టుపై సమగ్రమైన అవగాహనతో సభలో ఆయన విలువైన సూచనలు చేసేవారు. 2015 మార్చి 3న బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి రాజ్యసభలో ఏచూరి సవరణలు ప్రతిపాదించారు. దీనిపై ఓటింగ్‌లో ఆయన ప్రతిపాదన నెగ్గింది. రాజ్యసభ చరిత్రలో ఇలా జరగడం అరుదు.
Similar News
News December 29, 2025
ఏడు కురచలు చూచి ఎద్దును కొనాలి(1/2)

పూర్వం ట్రాక్టర్లు లేని కాలంలో వ్యవసాయానికి ఎద్దులే ఆధారం. ఒక ఎద్దు పనికి వస్తుందో లేదో దాని శారీరక లక్షణాలను బట్టి అప్పటి అనుభవజ్ఞులైన రైతులు అంచనా వేసేవారు. ఈ సామెతలోని “ఏడు కురచలు” అంటే ఎద్దుకు ఉండాల్సిన ఏడు పొట్టి (చిన్న) అవయవాలు. మెడ, తోక, చెవులు, కొమ్ములు, ముఖం, వీపు, గిట్టలు పొట్టిగా లేదా చిన్నగా ఉన్న ఎద్దును కొనాలని నాడు పెద్దలు చెప్పేవారు.
News December 29, 2025
హైదరాబాద్ ESICలో 102 పోస్టులు.. నేటి నుంచి ఇంటర్వ్యూలు

<
News December 29, 2025
చండీ ప్రదక్షిణ చేసేటప్పుడు పఠించాల్సిన మంత్రమిదే…

యానికాని చ పాపాని జన్మాంతరకృతానిచ|
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ |
త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సల ||
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావనే రక్ష రక్ష మహేశ్వర ||


