News January 12, 2025

విధుల్లో నిర్లక్ష్యం.. ఇద్దరు వైద్యులకు ₹11.42 కోట్ల జరిమానా

image

మెడికల్ నెగ్లిజెన్స్ వల్ల ఇద్ద‌రు వైద్యులు ₹11.42 Cr నష్టపరిహారం చెల్లించాలని మ‌లేషియా కోర్టు ఆదేశించింది. 2019లో పునీతకు బిడ్డ జన్మించాక తీవ్ర ర‌క్త‌స్రావమైంది. ప్లాసెంటా వ‌ల్ల ర‌క్త‌స్రావం జ‌రిగింద‌ని ఆమె కుటుంబ స‌భ్యుల‌కు చెప్పిన డా.ర‌వి డ్రింక్స్ బ్రేక్‌కు వెళ్లారు. కొద్దిసేప‌టికే పునీత మృతి చెందారు. క్లినిక్ యజమాని Dr.ష‌ణ్ముగం, Dr.ర‌విని బాధ్యుల‌ను చేసి ₹11.42 Cr బాధితులకు చెల్లించాలంది.

Similar News

News January 12, 2025

నేడు మృతుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ

image

AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో మరణించిన ఆరుగురి కుటుంబాలకు నేడు టీటీడీ చెక్కులు పంపిణీ చేయనుంది. ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలోని బృందాలు వైజాగ్, నర్సీపట్నం, తమిళనాడు, కేరళలోని మృతుల కుటుంబాల ఇంటికి వెళ్లనున్నాయి. వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున చెక్కు ఇవ్వడంతో పాటు కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం, ఉచిత విద్యను అందించేందుకు వివరాలు సేకరించనున్నాయి.

News January 12, 2025

యువతకు స్ఫూర్తి ప్రదాత.. వివేకానంద

image

భారతీయ ఆధ్యాత్మిక విలువలను ప్రపంచానికి చాటిన తత్వవేత్త స్వామి వివేకానంద. దేశ సాంస్కృతిక వైభవాన్ని విశ్వవ్యాప్తి చేయడంలో ఆయన నిరంతరం కృషి చేశారు. 1893లో చికాగోలో హిందుత్వాన్ని పరిచయం చేస్తూ చేసిన ప్రసంగంతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. యువతే దేశ అభివృద్ధికి పునాదులు అంటూ నిరంతరం ప్రోత్సహించేవారు. ఆయనకు గౌరవ సూచకంగా వివేకానంద జయంతి(JAN 12)ని జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం.

News January 12, 2025

నేడు అరకు లోయకు సుప్రీంకోర్టు జడ్జిలు

image

AP: సుప్రీంకోర్టు సీజేఐ సంజీవ్ ఖన్నాతో సహా 25 మంది న్యాయమూర్తుల బృందం నేడు అరకులోయలో పర్యటించనుంది. వీరంతా విశాఖపట్నం నుంచి రైలులో ఉదయం 10.30 గంటలకు అరకు లోయకు చేరుకోనున్నారు. గిరిజన మ్యూజియం, గిరి గ్రామదర్శినిని పరిశీలిస్తారు. స్థానిక గిరిజనుల స్థితిగతులను, పరిస్థితులను తెలుసుకోనున్నారు. అనంతరం బొర్రా గుహలను సందర్శించనున్నారు. వీరి రాక నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.