News June 23, 2024

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో స్థానిక విద్యార్థులకు నష్టం: BRS

image

TG: MBBS మెడికల్ సీట్లను స్థానిక విద్యార్థులకు మాత్రమే రిజర్వ్ చేయాలనే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని BRS ఆరోపించింది. దీని వల్ల TG విద్యార్థులు 500-800 UG సీట్లు, దాదాపు 200 PG సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని ట్వీట్ చేసింది. ‘రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎవరి ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తోంది? ఏపీ విద్యార్థులకు అనుకూలంగా వ్యవహరించాలని అనుకుంటోందా?’ అని ప్రశ్నించింది.

Similar News

News November 3, 2025

రూ.500కే రూ.16 లక్షల ప్లాటు గెలిచింది

image

TG: లాటరీలో ఓ 10 నెలల చిన్నారిని అదృష్టం వరించింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో తీసిన లక్కీ డ్రాలో రూ.500కే ఏకంగా రూ.16 లక్షల విలువైన ప్లాటును గెలుచుకుంది. రామ్ బ్రహ్మచారి అనే వ్యక్తి 66 గజాల ప్లాటుకు లక్కీ డ్రా నిర్వహించారు. శంకర్ అనే వ్యక్తి ఫ్యామిలీ పేరుతో 4 కూపన్లు తీసుకోగా.. 2307 అనే నంబరుతో కుమార్తె హన్సికకు ఈ బహుమతి దక్కింది. రూ.500కే ప్లాటు దక్కడంపై వారు ఆనందం వ్యక్తం చేశారు.

News November 3, 2025

Take A Bow: మనసులు గెలిచిన కెప్టెన్ లారా

image

భారత్ ఉమెన్స్ WCను లిఫ్ట్ చేసినప్పుడు గెలుపు గర్జనతో స్టేడియం మారుమోగింది. అంతా విజయోత్సాహంలో నిండిపోయారు. కానీ, SA కెప్టెన్ లారా ముఖంలో విషాదం నిండిపోయింది. ఫైనల్లో సెంచరీ సహా 9 మ్యాచుల్లో 571 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచారు. అయినా SAకి తొలి WC అందించాలన్న తన కల సాకారం కాలేదు. అయితే ఆమె పోరాటం క్రికెట్ అభిమానుల మనసులు గెలిచింది. బెటర్ లక్ నెక్ట్స్ టైమ్ లారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

News November 3, 2025

షెఫాలీ షో.. చరిత్ర సృష్టించింది

image

షెఫాలీ వర్మ ఉమెన్స్ వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించారు. ఫైనల్లో 87 రన్స్ చేయడమే కాకుండా.. 2 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు. వరల్డ్ కప్ ఫైనల్లో ఈ ఘనత సాధించిన యంగెస్ట్ ప్లేయర్ షెఫాలీ(21 ఇయర్స్) కావడం విశేషం. గాయపడిన ప్రతీక స్థానంలో జట్టులోకి వచ్చిన ఆమె అనూహ్యంగా భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ‘ఏదో మంచి చేయాలనే భగవంతుడు నన్ను జట్టులోకి పంపాడు’ అంటూ షెఫాలీ ఆనందం వ్యక్తం చేశారు.