News May 23, 2024
చర్చలు విఫలం.. ఆరోగ్య శ్రీ సేవల బంద్ కొనసాగింపు

AP: ప్రభుత్వంతో ప్రైవేట్ ఆస్పత్రుల చర్చలు మరోమారు విఫలమయ్యాయి. రూ.1500 కోట్ల బకాయిల్లో రూ.800 కోట్లు విడుదల చేయాలని కోరినట్లు ఆస్పత్రుల అసోసియేషన్ తెలిపింది. ఆరోగ్య శ్రీ ట్రస్ట్ CEO రూ.203 కోట్లు విడుదల చేస్తామన్నారని పేర్కొన్నాయి. దీంతో స్కీమ్ సేవల బంద్ కొనసాగిస్తున్నట్లు చెప్పాయి. అయితే ఆస్పత్రుల్లో పథకం సేవలు కొనసాగేలా చూడాలని కలెక్టర్లను CEO ఆదేశించారు. బకాయిలు త్వరలో విడుదల చేస్తామన్నారు.
Similar News
News January 19, 2026
రాష్ట్ర స్థాయి అధికారిగా మన అనంత జిల్లా వాసి

ఏపీ RTI కమీషనర్‌గా అనంతపురానికి చెందిన గాజుల ఆదెన్న నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. గాజుల ఆదెన్న మాట్లాడుతూ.. తన మీద నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఈయన అనంతపురం నగర పాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా పని చేశారు.
News January 19, 2026
ఖమేనీపై దాడి జరిగితే పూర్తి స్థాయి యుద్ధమే: ఇరాన్

తమ ప్రజల కష్టాలకు అమెరికా, దాని మిత్రదేశాలే ప్రధాన కారణమని ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ ఆరోపించారు. అమానవీయ ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు. దురాక్రమణకు ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. తమ సుప్రీం లీడర్ ఖమేనీపై దాడి జరిగితే అది ఇరాన్‌పై పూర్తి స్థాయి యుద్ధంతో సమానమని స్పష్టం చేశారు. ఇరాన్‌లో కొత్త నాయకత్వం కోసం సమయం వచ్చిందని ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇలా స్పందించారు.
News January 19, 2026
రాష్ట్రంలో 198 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

TGSRTCలో 198 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ, డిప్లొమా, BE, BTech అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ 84, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులు 114 ఉన్నాయి. వయసు 18- 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.tgprb.in * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.


